
జనావాసాల్లో స్లాటర్ హౌస్‌లు
జగిత్యాల: పురపాలక చట్టం ప్రకారం మేకలు, గొర్రెలను కచ్చితంగా స్లాటర్‌హౌస్‌లోనే వధించాలి. కానీ.. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో ఎక్కడ పడితే అక్కడే మాంసం విక్రయాలు చేపడుతున్నా ప్రజారోగ్యాన్ని మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగస్వాములు కావాలంటే మున్సిపల్‌లో తక్షణంగా ప్రతిచోట కబేళాలు ఏర్పాటు చేసుకోవాలని షరతు ఉంది. అయితే జిల్లాలోని మున్సిపాలిటీల్లో మాత్రం జనవాసాల్లో.. రోడ్లపైనే జంతువధ కొనసాగుతోంది.
మాంసం విక్రయాలు అధికం
సెలవురోజులతో పాటు, ఆదివారాల్లో అయితే దాదాపు 90 శాతం మంది మేక, గొర్రె మాంసం కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న విక్రయదారులు నాణ్యత లేని మాంసాన్ని అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. తూకంలోనూ 100 నుంచి 150 గ్రాములు తక్కువ విక్రయిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మాంసం విక్రయదారులు ఇదే అదునుగా భావించి ఇష్టానుసారంగా ప్రజలకు అంటగడుతుంటారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
నిబంధనల ప్రకారం స్లాటర్ హౌస్‌లోనే జంతువులను వధించి పశువైద్యాధికారితో ముద్రించబడిన మున్సిపాలిటీ మేక, గొర్రెలపై ముద్ర ఉన్న వాటినే మాంసం కొనుగోలు చేసుకోవాలి. కొందరు ఈ ముద్రను ఉంచి ఇతర మాంసం కూడా అమ్ముతుంటారు. ప్రజలు జాగ్రత్తగా గమనించి మున్సిపాలిటీ ముద్రించిన మాంసాన్ని కొనుగోలు చేసుకోవాలి.
లోపిస్తున్న పారదర్శకత
మాంసం విక్రయాల్లో పారదర్శకత లోపిస్తోంది. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మాంసం విక్రయదారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం పశుసంవర్థక శాఖ వైద్యాధికారి పర్యవేక్షణలో స్లాటర్ హౌస్‌ల వద్ద మేకలు, గొర్రెలు కోయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ కోసి విక్రయాలు కొనసాగిస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో చనిపోయినవి, రోగాల బారిన పడినవి కోస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ స్లాటర్‌హౌస్‌లో కోసిన మాంసం మార్కెట్లలోనే విక్రయించాల్సి ఉంటుంది. కానీ ఆవాస ప్రాంతాల్లో అనుమతి లేకుండానే అమ్ముతున్నారు. వీటన్నింటిని తరలించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. నిబంధనల ప్రకారం వధించే గొర్రెలు, మేకలను ఒకరోజు ముందే మార్కెట్‌కు తీసుకొస్తే వాటికి పరీక్షలు చేసిన అనంతరం అనుమతించాల్సి ఉంటుంది. ఇవన్నీ పాటించకుండా మాంసం విక్రయదారులు ఇష్టారాజ్యంగా మేకలు, గొర్రెలు వఽ దిస్తూ జేబులు నింపుకుంటున్నారు. నియంత్రించా ల్సిన స్థానిక సంస్థల అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజారోగ్యానికి విఘాతం కలుగుతోంది.
నిబంధనలు హుష్‌కాకి
మున్సిపాలిటీల్లోనే మాంసం మార్కెట్లు ఉండాలనే నిబంధనలున్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీలో మార్కెట్లు ఉన్నప్పటికీ ఎక్కువగా వీధుల్లోనే విక్రయిస్తున్నారు. ప్రతి ఆదివారం జిల్లాలోని మున్సిపాలిటీలో వెయ్యికి పైగా గొర్రెలు, మేకలను కోస్తుంటారు. పండగ సీజన్లలో మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు అమ్ముడు పోని మాంసాన్ని రెండుమూడు రోజులు నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం.
కనిపించని పశువైద్యాధికారులు
నిబంధనల ప్రకారం స్లాటర్ హౌస్‌లో జంతువుల ను కోసే ముందు పశువైద్యాధికారి ధ్రువీకరణ ప త్రం ఇవ్వాల్సి ఉంటుంది. గొర్రెలు, మేకలు నాణ్యౖ మెనవేనా..? రోగాల బారిన పడినవా..? లేదా..? పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా ఒక పశువైద్యాధికారిని ని యమించుకోవాల్సి ఉంటుంది. కానీ.. బల్దియాల్లో పశువైద్యాధికారులు కనిపించడం లేదు. స్లాటర్ హౌస్‌ల వద్ద శానిటరీ ఇన్‌స్పెక్టర్లే పర్యవేక్షిస్తున్నారు.
నాణ్యతలేని మాంసం విక్రయాలు
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులు
ప్రజారోగ్యం పట్టని అధికారులు
స్లాటర్‌హౌస్‌లు అందుబాటులోకి వస్తే..
జిల్లాలోని మున్సిపాలిటీల్లో కేవలం జగిత్యాలలో మాత్రమే స్లాటర్‌హౌస్ ఉంది. కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురిలో లేవు. ఈ బల్దియాలో ఎక్కువ శాతం జనావాసాల మధ్యే కోస్తున్నారు. స్లాటర్‌హౌస్‌ల్లో జీవాలను అక్కడ వధిస్తే వ్యాపారులకు కోల్డ్ స్టోరేజీ కూడా ఉంటుంది. అవసరమైతే మాంసం నిల్వ చేసుకోవచ్చు. జీవాలను వధించిన తర్వాత వాటి చర్మం, రక్తం, ఇతర వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాలతో పాటు వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండి మాంసం నాణ్యతను పరిశీలిస్తారు. జిల్లా కేంద్రంలోని స్లాటర్ హౌస్‌కు ఎలాంటి టెండర్ వేయకపోవడంతో మాంసం విక్రయదారులు స్లాటర్‌హౌస్‌లో ఊరికనే కోసుకుంటున్నారు. మేకకు రూ.10 నుంచి రూ.20 చొప్పు నిర్ణయిస్తే అటు మున్సిపాలిటీకి ఆదాయం లభిస్తుంది. కొందరు ఫంక్షన్లకు సంబంధించిన మేకలు, గొర్రెలను ఇందులోనే కట్ చేస్తున్నారు.

జనావాసాల్లో స్లాటర్ హౌస్‌లు

జనావాసాల్లో స్లాటర్ హౌస్‌లు