నూకలు వస్తున్నయి
మా కుటుంబానికి ఈనెల 18 కిలోల సన్నబియ్యం ఇచ్చిండ్రు. అందులో రెండు కిలోల నూకలు వచ్చినయి. మిగతా బియ్యం మంచిగనే ఉన్నయ్. ఇవే మాకు ఆధారం. ప్రతీనెల సన్నబియ్యం ఇస్తే మాకు ఎంతో ఆసరాగా ఉంటుంది.
– సత్తమ్మ, యైటింక్లయిన్‌కాలనీ
సన్నబియ్యం బాగున్నాయి
వారం కిందట రేషన్ బియ్యం తెచ్చుకున్న. కొద్దిగా నూకలు వచ్చినయి. అయినా, మంచిగానే ఉన్నయి. సన్నబియ్యం వండుకుని తిన్నం. మాలాంటి పేదలకు సన్నబియ్యం ఇవ్వడం మంచిదే. పథకాన్ని ఇలాగే కొనసాగించాలి.
– బిట్ల వజ్రవ్వ, ముస్తాబాద్, సిరిసిల్ల
నూకలు వస్తున్నయి


