పేదవారి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యం
మేడిపల్లి: పేదవారి కళ్లలో ఆనందం చూడడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మేడిపల్లి మండలం పొరుమల్లలో సన్న బియ్యం పంపిణీని ప్రారంభించి అనంతరం పోరుమల్ల, గుండ్లపల్లి, తొంబ్రావుపేట గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పేదల ప్రజలకు అందించే దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం అందించాలని ఓ దృఢ సంకల్పంతో మేనిఫెస్టోలో చెప్పకుండా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని అన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీ, రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.
ఏకగ్రీవం కానున్న బార్ అసోసియేషన్ ఎన్నిక
జగిత్యాలజోన్: జగిత్యాల బార్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగియడంతో జూనియ ర్ కార్యవర్గ పోస్టులు మినహా మిగతా పోస్టులకు ఒకే నామినేషన్ దాఖలయ్యాయి. అధ్యక్ష స్థానానికి నామినేషన్ వేసిన రాచకొండ శ్రీరా ములు, ఉపాధ్యక్షుడిగా మహేంద్రనాథ్, ప్రధా న కార్యదర్శిగా ఎ.మారుతి, సంయుక్త కార్యదర్శిగా తర్బుజ నర్సయ్య, కోశాధికారిగా ఎం.ప్రతీప్‌కుమార్, లైబ్రరీ కార్యదర్శిగా మానాల వెంకటరమణ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా కంచి సురేశ్, మహిళ కార్యదర్శిగా పడాల రాధలు ఒకే నామినేషన్ దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అలాగే 10 జూ నియర్ కార్యవర్గ సభ్యుల పదవులకు 11 మంది పోటీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ వరకు ఒకరు విత్‌డ్రా చేసుకుంటే మొత్తం కార్యవర్గం ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
బ్రిడ్జి పనులు పరిశీలన
రాయికల్: రాయికల్ మండలం మైతాపూర్–జోగినిపల్లి మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మాజీ మంత్రి జీవన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తానని అన్నారు.ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, నాయకులు మహేందర్‌గౌడ్, తలారి రాజేశ్ ఉన్నారు.
అభ్యాసన కార్యక్రమాలు అమలు చేయాలి
జగిత్యాల: పాఠశాలల్లో అభ్యాసన, అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా అమలు చేయాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం టీచర్స్ భవన్‌లో ఉపాధ్యాయులకు సబ్జెక్ట్‌ల వారీగా నిర్వహించిన శిక్షణలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సబ్జెక్ట్‌ల వారీగా రాబట్టాలని, ఇందుకు శిక్షణ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆశించిన ఫలితాలు సాధించి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ మహేశ్, రాజేశ్, ఆర్పీలు పాల్గొన్నారు.
వేంకటేశ్వరునికి క్షీరాభిషేకం
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం రంగురంగుల పూలతో అలకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు మంత్రోచ్ఛరలతో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవనం నిర్వహించారు.
పేదవారి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యం
పేదవారి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యం
పేదవారి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యం
పేదవారి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యం


