వేతనం.. వ్యత్యాసం! | - | Sakshi
Sakshi News home page

వేతనం.. వ్యత్యాసం!

Apr 8 2025 7:23 AM | Updated on Apr 8 2025 7:23 AM

వేతనం

వేతనం.. వ్యత్యాసం!

● జగిత్యాల మున్సిపాలిటీలో కార్మికుల జీతాల్లో తేడా ● కొందరు పారిశుధ్య వాహన డ్రైవర్లకు రూ.19,500 ● మరికొందరికి రూ.16,500 ఇస్తున్న అధికారులు ● ఇదెక్కడి అన్యాయం అంటున్న బాధిత కార్మికులు ● ఆందోళనకు దిగుతామని హెచ్చరిక

జగిత్యాల:

జగిత్యాల.. గ్రేడ్‌–1 మున్సిపాలిటీ. దాదాపు 305 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 262 మంది కాంట్రాక్టు పద్ధతిన కొనసాగుతున్నారు. పారిశుధ్య కార్మికులకు రూ.16,500, ఇతర పనులు చేసేవారికి రూ.19,500 వేతనం అందిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య ఏర్పడింది. పారిశుధ్య వాహ న డ్రైవర్లకు సైతం 19,500 వేతనం ఇవ్వాలని 2020లో కౌన్సిల్‌లో తీర్మాణం చేశారు. అప్పటి నుంచి 56 మంది డ్రైవర్లకు రూ.19,500 జీతం ఇస్తున్నా రు. మరో 12 మందికి మాత్రం పారిశుధ్య కార్మికుల మాదిరిగానే రూ.16,500 జీతం అందిస్తున్నారు. ఇదేక్కడి అన్యాయం అని ఈ 12 మంది కౌన్సిల్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్తారు. వీరికి సైతం రూ.19,500 ఇవ్వాలని 24.01.2025న తీర్మాణం చేస్తూ కౌన్సిల్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు సదరు తీర్మాణం అమలు కావడం లేదు. దీంతో మేం ఏం పాపం చేశామని, ఎందుకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం జీవో ప్రకారం ఉత్తర్వు లేదని, కలెక్టర్‌ అనుమతి తీసుకుని జీతం పెంచడం జరుగుతుందని సమాధానం ఇస్తున్నారు.

మొత్తం 68 మంది డ్రైవర్లు

మున్సిపాలిటీలోని పారిశుధ్యవిభాగంలో కార్మికులతో పాటు, డ్రైవర్లు కీలకంగా వ్యవహరిస్తుంటారు. జగిత్యాల బల్దియాలో 48 ఆటోలు, 12 ట్రాక్టర్లు, 2 జేసీబీలు, ఒక డోజర్‌, ఒక టిప్పర్‌, రెండు బ్లేడ్‌ ట్రాక్ట ర్లు, ఒక వైకుంఠ రథం, డంపస్‌ ఫేసర్‌ ఉన్నాయి. మొత్తం 68 వాహనాలకు 68 మంది డ్రైవర్లు కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్నారు. వీరు నిత్యం ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంపింగ్‌యార్డుకు తరలిస్తుంటారు. వీరు చేసే పని కష్టతరమైందని గుర్తించిన బల్దియా గత పాలకవర్గం 16,500 ఉన్న వేతనాన్ని రూ.19,500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో కొందరికి సదరు వేతనం ఇప్పటికీ అందడం లేదు. 68మందిలో 12మంది డ్రైవర్లు ఐదేళ్లుగా 16,500 వేతనానికే పని చేస్తున్నా రు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తున్నారు. మిగితా 56 మంది మాదిరిగానే వేతనం ఇవ్వాలని మూడు నెలల క్రితం పాలకవర్గం తీర్మానం చేసినా.. ఎందరు పెంచడం లేదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు సైతం జీతభత్యాలు పెంచి ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు.

జవాన్ల ఇబ్బందులు

మున్సిపాలిటీలో జవాన్లది సైతం కీలకపాత్రే. వా ర్డుల వారీగా జవాన్లు పర్యవేక్షిస్తుంటారు. ప్రతీ వార్డులో తిరుగుతూ పారిశుధ్యం మెరుగుపర్చడంతో పాటు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. డ్రెయినేజీల్లో చెత్త పేరుకుపోయినా, ఎక్కడైనా ఏ సంఘటన చోటుచేసుకున్నా జవాన్లదే బాధ్యత ఉంటుంది. అయితే వీరికి గతంలో పెట్రోల్‌ అలవెన్స్‌ ని మిత్తం నెలకు రూ.3 వేలు ఇచ్చేవా రు. ప్రస్తుతం అవి కూడా రాకపోవడంతో జీతాల నుంచి వెచ్చించి వార్డులు తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పెట్రోల్‌ ఖర్చులు ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు.

ఆందోళనకు సిద్ధం

కార్మికుల జీతాల్లో వ్యత్యాసాలతో పాటు, జవాన్లకు సంబంధించిన పెట్రోల్‌ ఖర్చులు ఇవ్వకపోవడంతో కార్మికులు ఆందోళనకు దిగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకవేళ కార్మికులు ఆందోళనకు దిగితే పారిశుధ్య నిర్వహణ కష్టంగా మారుతుంది. ఇప్పటికై నా మున్సిపల్‌ అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని బల్దియా కార్మికులు కోరుతున్నారు.

దృష్టికి

వచ్చింది

కొంత మంది డ్రైవర్లకు సంబంధించిన జీతభత్యాల గురించి మా నోటీసుకు వచ్చింది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం. గతంలో ఎలా ఇచ్చారన్నది పరిశీలించి దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. కార్మికులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. నేరుగా మా దృష్టికి తీసుకువస్తే ఏ సమస్యను అయినా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.

– స్పందన, మున్సిపల్‌ కమిషనర్‌, జగిత్యాల

వేతనం.. వ్యత్యాసం!1
1/2

వేతనం.. వ్యత్యాసం!

వేతనం.. వ్యత్యాసం!2
2/2

వేతనం.. వ్యత్యాసం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement