
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఆకుల శృతి (27) సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శృతి ఎంకాం పూర్తి చేసింది. పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతూ.. ఇటీవలే గ్రూప్–1, 2 పరీక్ష రాసినా మంచి ర్యాంక్ రాలేదు. వీటికితోడు శృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. మరోవైపు శృతి ఏడాదికాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స చేయించుకుందామంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనస్తాపానికి గురైన శృతి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శృతి తల్లి రోజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు.
పండుగ కోసం వచ్చి.. ప్రాణాలు వదిలి..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సుల్తానాబాద్‌రూరల్ (పెద్దపల్లి): ఐతరాజుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన పంగ నిఖిల్(26) మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. పంగ భాస్కర్–పద్మ దంపతుల కుమారుడు నిఖిల్ హైదారాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది పండుగ కోసమని ఈనెల 29న స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఐతరాజుపల్లిలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి రాత్రి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలు దేరాడు. ఈక్రమంలో ప్రమాదవాశాస్తు ద్విచక్ర వాహనంపై నుంచిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
ఈత చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన గీత కార్మి కుడు దాసరి లచ్చయ్య (54) సోమవారం ప్రమాదవశాత్తు ఈత చెట్టుపై నుంచి పడి మృతిచెందాడు. లచ్చయ్య కల్లు గీసేందుకు ఈతచెట్టు ఎక్కగా ప్రమాదశాత్తు కాలజారి కిందపడటంతో బలమైన గాయాలయ్యా యి. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య దాసరి మల్లమ్మ ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు.
పాముకాటుతో రైతు మృతి
తిమ్మాపూర్(మానకొండూర్): మండలంలోని గొల్లపల్లికి చెందిన రైతు కొమ్మెర నరసింహారెడ్డి(57) పాముకాటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. నరసింహారెడ్డి సోమవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. వరి పంటకు నీరు పెట్టి తిరిగి వస్తున్న క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. గమనించిన పక్క రైతు బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
బూడిద ట్యాంకర్ బోల్తా
గోదావరిఖని: స్థానిక బీగెస్ట్‌హౌస్ సమీపంలోని రాజీవ్ రహదారి మూలమలుపు వద్ద సోమవారం బూడిద ట్యాంకర్ బోల్తాపడింది. మంచిర్యాల నుంచి గోదావరిఖని వైపు వస్తున్న 22టైర్ల ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడిపోయింది. అతివేగంగా వస్తున్న డ్రైవర్‌కు మూలమలుపు కల్పించక పోవడంతో ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి.
కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు
చిగురుమామిడి(హుస్నాబాద్): మండలంలోని గునుకులపల్లెకు చెందిన శ్రీనివాస్‌పై పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని అదే గ్రామానికి చెందిన హరికృష్ణ కత్తితో దాడిచేసినట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. గాయపడిన శ్రీనివాస్‌ను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హరికృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఉరేసుకుని యువతి ఆత్మహత్య

ఉరేసుకుని యువతి ఆత్మహత్య