రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం
పెగడపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని కేంద్రం కుట్రలను తిప్పకొట్టాలని సూచించారు. జైబాపు, జైబీమ్, జైసంవిధాన్ పాదయాత్రలో భాగంగా గురువారం మండలంలోని నంచర్ల నుంచి ల్యాగలమర్రి వరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను ప్రారంభించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. కేంద్రప్రభుత్వం బాబాసాహెబ్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని విమర్శించారు. మైనార్టీ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభారాణి, మండల అధ్యక్షుడు రాములుగౌడ్, మాజీ జెడ్పీటీసీలు రాజేందర్‌రావు, మోహన్‌రెడ్డి, విండో చైర్మన్ భాస్కర్‌రెడ్డి, విండో మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.


