
అర్హులందరికీ రేషన్ కార్డులు
● విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
బుగ్గారం(ధర్మపురి): అర్హులందరికీ త్వరలో కొత్త రేషన్‌కార్డులు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని గంగాపూర్‌లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానికుడు రెంటం మల్లయ్య ఇంట్లో సన్నబియ్యంతో వండిన ఆహా రాన్ని నాయకులు, కార్యకర్తలతో కలిసి భుజించారు. భవిష్యత్‌లో మరిన్ని పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
పేదల సంక్షేమానికి ప్రాధాన్యం
వెల్గటూర్(ధర్మపురి): పేదల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రాధాన్యమని విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే 24 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. బుగ్గారం, వెల్గటూ ర్ మండలాల అధ్యక్షులు వేముల సుభాష్, శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ గోపిక, వైస్ చైర్మన్ తిరుపతి, నాయకులు రామ్మోహన్‌రావు, గోపాల్‌రెడ్డి, మురళీ, సందీప్, తదితరులు పాల్గొన్నారు.