యువత దేశసేవలో ముందుండాలి
● కమాండింగ్ అధికారి జయంత
జగిత్యాల: యువత దేశసేవలో ముందుండాలని 9వ బెటాలియన్ ఎన్‌సీసీ కమాండింగ్ అధికారి జయంత అన్నారు. బుధవారం జగిత్యాలలోని ఎస్‌కేఎన్‌ఆర్ (ప్రభుత్వ) కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు భద్రత బలగాల్లో ఎన్నో అవకాశాలున్నాయని, సాహసం, ధైర్యం గల యువతకు త్రివిధ దళాల్లో, పారామిలిటరీ దళాల్లో ఉపాధి అవకాశాలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. శారీరక సామర్థ్యాన్ని పెంచుకుని అవకాశాలను అందిపుచుకోవాలన్నారు. ప్రిన్సిపల్ అశోక్ మాట్లాడుతూ.. జయంత వద్ద ఎన్‌సీసీ కెడెట్లు శిక్షణ విజయవంతంగా తీసుకోవాలన్నారు. కళాశాలలో అన్ని వనరులున్నాయని, వాటిని వినియోగించుకోవాలన్నారు. అనంతరం అధ్యాపక బృందం కమాండింగ్ అధికారి జయంతను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారి లిఫ్ట్‌నెంట్ రాజు, సుబేదార్ సూర్యప్రకాశ్, శివానీ, గోవర్దన్, సురేందర్ పాల్గొన్నారు.


