
రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం
● రూ.30 లక్షల మేర ఆస్తినష్టం
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం కృష్ణానగర్‌లోని ఖుషి రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధి రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న ఖుషి రెస్టారెంట్‌లో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఎన్టీపీసీ పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి ఎన్టీపీసీ ఎస్సై టి.ఉదయ్‌కిరణ్‌తో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేసేందుకు చర్యలు చేపట్టారు. మొదటి అంతస్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది పూర్థిస్థాయిలో మంటలను ఆర్పివేశారు. కింది అంతస్తులో బ్యాంకు ఉండగా ఎలాంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసి చర్యలు చేపట్టడంతో ప్రమాదం తప్పింది. ఖుషి రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ఆస్తినష్టం జరిగిందని యజమాని గుర్రం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలే రెస్టారెంట్ ప్రారంభించామని, ఇంతలోనే అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ.30 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని వాపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.