
షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం
● రూ.3లక్షల వరకు ఆస్తి నష్టం
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన టేకు పద్మ–శంకరయ్య దంపతుల పూరి గుడిసె గురువారం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. బాధితులు తెలిపిన వివరాలు. గురువారం ఉదయం పద్మ ఇంట్లో బట్టలు ఉతుకుతుండగా మీటర్ నుంచి పొగలు వచ్చి గుడిసె అంటుకుంది. మంటల్లో బీరువా, ఫ్రిజ్ కాలిపోయాయి. బీరువాలో నగదు, బంగారు, వెండి నగలు కాలిపోవడంతో దాదాపు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లింది. శంకరయ్య మేకలు కొనేందుకు తెచ్చిన రూ.50వేలు సైతం కాలిపోయాయి. సన్నబియ్యం పంపిణీకి వచ్చిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ విషయం తెలుసుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. తక్షణ సాయంగా రూ.50వేలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూ.5వేలు నగదు సాయం అందించారు.