చేపల వేటకు వెళ్లి విద్యుత్‌షాక్‌తో మృతి
జగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన చింతకుంట్ల రాజనర్సయ్య (58) అనే వ్యక్తి శనివారం చేపల వేటకు వెళ్లి విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. రాజనర్సయ్య శనివారం ఉదయం గ్రామ శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లాడు. వాగులో కరెంట్ షాక్ పెట్టి చేపలు పడుతున్న సమయంలో తీగలు తీయకుండానే వాగులోకి వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు.
గుండెపోటుతో ఉపాధి కూలి మృతి
కోరుట్ల రూరల్: మండలంలోని నాగులపేట గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి కుంట లక్ష్మీనర్సు (55)గుండెపోటుతో మృతిచెందారు. లక్ష్మీనర్సు ఎప్పటిలాగే కూలికి వెళ్లింది. తోటికూలీలతో కలిసి కాలువ పూడికతీత పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. అక్కడే కుప్పకూలింది. కూలీలు 108లో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లక్మీనర్సు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మీనర్సుకు కుమారుడు, కూతురు ఉన్నారు.


