కోరుట్ల రూరల్: మండలంలోని బీఆర్‌ఎస్ మాజీ సర్పంచ్‌లను పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమ పదవీకాలంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనే డిమాండ్‌తో అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మండలంలోని మాజీ సర్పంచులను వారివారి గ్రామాల్లో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి.. వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. అరెస్టయిన వారిలో మాజీ సర్పంచులు దారిశెట్టి రాజేశ్, వనతడుపుల అంజయ్య, దుంపాల నర్సూ, చెప్యాల నర్సయ్య, భాస్కర్ రెడ్డి ఉన్నారు.
అక్రమ అరెస్ట్‌లు సరికాదు
జగిత్యాలక్రైం: మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసులతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలీసులు రాజ్యాంగం, చట్టానికి లోబడి పనిచేయాలని, అలా కాకుండా ఒకే పార్టీకి లోబడి పనిచేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు. అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదేలేదని, ప్రజా సమస్యలపై పోరాడుతూ మోసపూరిత హామీలను ఎప్పటికప్పుడు ఎండగడుతామన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాంమోహన్‌రావు, సింగిల్ విండో చైర్మన్లు సాగర్‌రావు, మహిపాల్‌రెడ్డి, మధుసూదన్, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు ఆనందరావు, గంగాధర్, తిరుపతి, ప్రవీణ్, తిరుపతి, రాజనర్సు, కరుణాకర్ పాల్గొన్నారు.
మాజీ సర్పంచుల ముందస్తు అరెస్ట్


