
పేదలందరికీ సన్నబియ్యం
● మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాల: పేదలందరికీ సన్నబియ్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆహారభద్రత చట్టాన్ని రూపొందించారని గుర్తు చేశారు. ప్రతి పౌరుడికి 6 కిలోల బియ్యం ఇవ్వడం హర్షణీయమన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సబ్సిడీ, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, సుభాష్, రమేశ్, స్వామిరెడ్డి, రఘువీర్ పాల్గొన్నారు.
11న జగిత్యాల, కోరుట్ల బార్
అసోసియేషన్ ఎన్నికలు
జగిత్యాలజోన్/కోరుట్ల: ఈనెల 11న జగిత్యాల, కోరుట్ల బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జగిత్యాల, కోరుట్ల ఎన్నికల అధికారులు నక్కల సంజీవరెడ్డి, ఎండీ.ముబీన్‌పాషా తెలిపారు. జగిత్యాలలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, లైబ్రరీ సెక్రటరీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, మహిళా ప్రతినిధి, 10 మంది కార్యవర్గ సభ్యుల పదవులకు ఎన్నికలు ఉండనున్నాయి. ఈనెల 3, 4తేదీల్లో నామినేషన్ల దాఖలు, 5న పరిశీలన, 7న ఉపసంహరణ, 11న ఎన్నికలు నిర్వహించి, ఫలితాల ప్రకటన ఉంటుంది. అధ్యక్ష స్థానానికి పోటీ చేసే వారు న్యాయవాదిగా 20 ఏళ్ల సీనియార్టీ, రూ.8వేల నామినేషన్ ఫీజు, ఉపాధ్యక్ష స్థానానికి పోటి చేసే వారు న్యాయవాదిగా 15 ఏళ్ల సీనియార్టీ, రూ.6 వేల నామినేషన్ ఫీజు, ప్రధాన కార్యదర్శిగా న్యాయవాదిగా 12 ఏళ్ల సీనియార్టీ, రూ.6వేల నామినేష న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని సంజీవరెడ్డి తెలి పారు. కోరుట్లలో ఈనెల 2, 3 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 7న ఉప సంహరణ, 11న ఎన్నికలు ఉంటాయని ముబీన్ పాషా పేర్కొన్నారు.