
ఊహ తెలిసినప్పటి నుంచి..
ఇల్లంతకుంట(మానకొండూర్): మాది ఇల్లంతకుంట మండల కేంద్రం. విద్యాభ్యాసం ముగిసిన నాటి నుంచి 50 ఏళ్లుగా సంప్రదాయ దోవతి కమీ జు ధరిస్తున్న. హైదరాబాదులోని నిజాం కాలేజీలో 1969లో విద్యాభ్యాసం ముగిసింది. ప్ర భుత్వ కార్యాలయాలు, వేడుకలు, ఎక్కడికి వె ళ్లినా దోవతి, కమీజు వేసుకుంటా. 1981 నుంచి 1993 వరకు ఇల్లంతకుంట సర్పంచ్‌గా చేసిన.
– చిట్టి కృష్ణారెడ్డి, ఇల్లంతకుంట
ఊరంతా తిరిగి ఆడుకునేవాళ్లం
మా చిన్నతనంలో ఉగాది పండగ వచ్చిందంటే ఊరంతా తిరిగి ఆడుకునేవాళ్లం. కుడుకల పేర్లు, బచ్చీల పేర్లు మెడలో వేసుకుని సంబురంగా తిరిగేటోళ్లం. గుడికాడికి వెళ్లి పంచాంగం వినేటోళ్లం. ఇలా ఊరంతా అక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా పండుగ జరుపుకునేది. ఇప్పుడు ఆ ఉత్సాహం లేదు.. ఉల్లాసం లేదు. ఏమైనా సెల్ ఫోన్ చూస్తూ.. మనుషులు పరాయివాళ్లలాగే ఉంటున్నారు. మా రోజుల్లో ఉగాది పండగ అంటే ఏడాదికో దినం. పిల్లల అంతా కలిసి సంబురంగా ఆటలు ఆడేది.
–భానోత్ గన్యానాయక్, చిన్నబోనాల, సిరిసిల్ల
ఆ ఉత్సాహమే లేదు
ఉగాది రోజున స్నానాలు చేసి పొద్దుగాలనే పొలంకాడికి పోయేవాళ్లం. వేపపువ్వు, మామిడికాయలు, మామిడి ఆకు, కొత్త చింతపండు తీసుకుని వచ్చి కొత్త కుండలో ఉగాది పచ్చడి చేసేవాళ్లు. కొబ్బరికాయ కొట్టి పచ్చడి పెట్టేదాకా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోయేది. బక్ష్యాలు తిని వెళ్లి పంచాంగం వినేవాళ్లం. వచ్చే ఏడాదంతా ఎలా ఉంటుంది. ఏ రాశి వారికి రాబడి ఎంత.. ఖర్చు ఎంత..? తెలుసుకుని మురిసిపోయే వాళ్లం. ఈ రోజుల్లో ఆ ఉత్సాహమే లేదు.
– భైరి ప్రభాకర్, వెంకంపేట, సిరిసిల్ల

ఊహ తెలిసినప్పటి నుంచి..

ఊహ తెలిసినప్పటి నుంచి..