
చెరువులకు నీటి గండం
మల్యాల: మండలకేంద్రానికి చుట్టూ నీరున్నా.. చెరువుల్లో మాత్రం చుక్క ఉండడం లేదు. చెరువులు నింపాలని ఏళ్ల తరబడి రైతుల విన్నపాలు అరణ్యరోదనే అవుతున్నాయి. మండలకేంద్రంలోని రైతులు, ప్రజలకు సాగు, తాగునీటికి ము ఖ్య ఆధారం సూరప్ప, రావి చెరువులు. ఈ రెండు చెరువులు నింపాలని రైతులు ఏళ్లతరబడిగా వేడుకుంటున్నారు. ఏటా వేసవిలో భూగర్భజలా లు ఎండిపోతుండడంతో వ్యవసాయ బావుల్లో ఊట తగ్గి పొలాలకు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. ఈ పరిసర ప్రాంతాలకు ఇటు ఎస్సారెస్పీ నీరుగాని, అటు వరదకాలువ నీరుగాని అందించడం లేదు. 30ఏళ్ల క్రితం సూరప్ప చెరు వు నింపేందుకు కొంపల్లె సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ నుంచి పైపులైన్ వేసినా ఆశించిన ఫలితం కనిపించలేదు. మల్యాలకు పశ్చిమాన వరదకాలువ, ఈశాన్యం, తూర్పున ఎస్సారెస్పీ కాలువ నీటితో పరిసర గ్రామాల్లో ధాన్యరాశులు కళకళలాడుతుంటే మండలకేంద్రంలోని చెరువులు నింపేందుకు ఇటు అధికారులుగాని, అటు రాజకీయ నాయకులుగాని చొరవ చూపడం లే దు. వరదకాలువతో మండలంలోని రాంపూర్, ఒబులాపూర్, మద్దుట్ల, గొల్లపల్లి, రామన్నపేట, పోతారం, నూకపల్లి, ముత్యంపేట, సర్వాపూర్, తాటిపల్లి గ్రామాలకు సాగునీరు అందుతోంది. ఎస్సారెస్పీ కాలువ ద్వారా మానాల, మ్యాడంపల్లి, తక్కళ్లపల్లి, లంబాడిపల్లి గ్రామాలకు సాగునీరందుతోంది. అయితే రావి చెరువు, సూరప్ప చెరువులకు మాత్రం ఇటు ఎస్సారెస్పీ నుంచిగానీ.. వరదకాలువ ద్వారాగానీ నీరు నింపిన దాఖలాలు లేవు.
ఎనిమిదేళ్ల క్రితం తూము ఏర్పాటు
ముత్యంపేట శివారులో వరదకాలువకు ఎనిమి దేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే బొడిగె శోభ వరదకాలువకు తూము నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. వరదకాలువ లోతు ప్రాంతంలో తూము ఏ ర్పాటు చేయడంతో ఆరు మీటర్ల నీరు ఉన్నప్పటి కీ నీరు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఏనాడూ సూరప్ప చెరువును నింపిన పాపాన పోలేదు. ముత్యంపేట శివారులోనే వరదకాలువకు మరో తూము ఏర్పాటు చేస్తామని గతంలో నాయకులు హామీలు ఇచ్చినా బుట్ట దాఖలే అయింది. వరదకాలువకు తూము ఏర్పా టు చేసి.. మారేడు కుంట, భీమన్న చెరువు, మ త్తడి చెరువు, రావి చెరువు, సూరప్ప చెరువు నింపాలని ప్రతిపాదనలు చేసినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. వర్షాకాలంలో వర్షపు నీరు మినహా మరోచోటి నుంచి వరదవచ్చే అవకాశమే లేకుండా పోయింది.
ఏటా ఎండిపోతున్న రావి, సూరప్ప చెరువులు
మండలకేంద్రానికి నీటి ఇబ్బందులు తీరెదెన్నడో..?