మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
జగిత్యాల/కోరుట్ల/ధర్మపురి: రంజాన్ వేడుకలను ముస్లింలు జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. జగిత్యాలలోని ఈద్గా, ఖిలా, జమా మసీదుల్లో ప్రార్థనలు చేశారు. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సంజయ్‌కుమార్, కల్వకుంట్ల సంజయ్, జీవన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అడువాల జ్యోతి, మాజీ కౌన్సిలర్లు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముఫ్తిమౌలానా, నౌషద్ అలీఅవేస్, ఖిలాలో హఫీజ్ అబ్రార్ షరీఫ్ ప్రార్థనలు నిర్వహించారు. సెంట్రల్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు ఎంఏ.బారి, ఈద్గా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ జమీల్ అహ్మద్, నిహాల్ సిరాజోద్దీన్ మన్సూర్, లియాకత్ అలీ మోసిన్, అబ్దుల్ ముజాహిద్ ఖాదర్, ఎంఏ.ఇఫ్రాన్ సత్తర్ పాల్గొన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాలతో డీఎస్పీ రఘుచందర్ బందోబస్తు చేపట్టారు. ధర్మపురిలోని వక్ఫ్‌బోర్డు ప్రాంతంలోని ఈద్గాల వద్ద విప్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కోరుట్లలో ఎమ్మెల్యే సంజయ్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
న్యూస్‌రీల్
ఈద్ ముబారక్
ఈద్ ముబారక్
ఈద్ ముబారక్
ఈద్ ముబారక్
ఈద్ ముబారక్