
ఉగ్రవాదుల దాడి మృతులకు నివాళి
జగిత్యాలటౌన్: ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి జిల్లా మహిళా ఐక్యవేదిక నాయకులు జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో నివాళులర్పించారు. పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచపటంలో లేకుండా చేస్తేనే భారత్‌లో శాంతి నెలకొంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకై నా మహిళా లోకం పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అరవ లక్ష్మి, వేముల మాధవి, భీమనాతిని ఉమాదేవి, మీనాక్షి, సింగం పద్మ తదితరులు ఉన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను మట్టుపెట్టాలని భారత్ సురక్షా సమితి నాయకులు ఏసీఎస్ రాజు కోరారు. ప్రధాని మోదీ తలచుకుంటే పాక్ కనుమరుగు కావడం ఎంతో దూరంలో లేదన్నారు.