
‘భూ భారతి’తో రైతులకు మేలు
రాయికల్/పెగడపల్లి: భూ భారతి చట్టంతో సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రాయికల్ పట్టణంతోపాటు పెగడపల్లి మండలకేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు వారివారి భూములపై సమగ్ర హక్కులు కల్పించాలని ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చిందన్నారు. ఆధార్‌కార్డు తరహాలోనే భూమికి భూదార్ సంఖ్య కేటాయిస్తారని, దీనిద్వారా భూ ఆక్రమణలకు చెక్ పడుతుందని అన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు తీర్చేందుకు గ్రామపరిపాలన అధికారి కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు.
సమస్యలకు సత్వర పరిష్కారం
భూ భారతితో భూసమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మ ణ్‌కుమార్ అన్నారు. అటవీ, రెవెన్యూ సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఉమ్మడి సర్వే నిర్వహిస్తామన్నారు. రాయికల్‌లో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ ఖయ్యూం, ఎంపీడీవో చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ మనోహర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు ఏనుగు మల్లారెడ్డి, రాజలింగం, దీటి రాజిరెడ్డి, ఏనుగు ముత్యంరెడ్డి, పెగడపల్లిలో ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, విండో చైర్మన్ భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, ఏవో శ్రీకాంత్, ఆర్‌ఐలు శ్రీనివాస్, జమున, ఏఈవోలు పాల్గొన్నారు.
సాదాబైనామాల దరఖాస్తులకు పరిష్కారం
భూ భారతి అవగాహన సదస్సులో కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడి