
భూభారతిలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ పునరుద్ధరణ
● అవగాహన సదస్సులో కలెక్టర్ సత్యప్రసాద్ ● పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
సారంగాపూర్: భూభారతి చట్టంలో పట్టాదా రుడు నష్టపోయినప్పుడు తిరిగి అప్పీలు చేసుకోవడానికి రెండంచెల వ్యవస్థ పునరుద్ధరించనున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం సారంగాపూర్ రైతువేదికలో భూభా రతి చట్టంపై అవగాహన కల్పించారు. ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సాదాబైనామాలకు ధరణిలో పరిష్కారం దొరకలేదని, భూభారతిలో సంపూ ర్ణ పరిష్కారం లభిస్తుందన్నారు. భూమి ఇతరుల పేరిట బదలాయింపు అయితే పట్టా దారుడు మొదటి అప్పీల్ కింద ఆర్డీవో, రెండో ప్పీల్ కింద జేసీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలి పారు. వివాదాల్లో ఉన్న భూములకూ పట్టాదా రుడు నష్టపోకుండా న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతు ధరణిలోని లో పాలను సవరిస్తూ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూద న్, తహసీల్దార్ జమీర్, ఎంపీడీవో గంగాధర్, డెప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ పాల్గొన్నారు.
నాణ్యమైన ధాన్యం తేవాలి
రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధా న్యం తేవాలని, తప్ప, తాలు లేకుండా చూడాలని కలెక్టర్, ఎమ్మెల్యే సూచించారు. కోనాపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తూకం వేయడానికి సీరియల్ నంబర్ పాటించాలని, తేమ శాతం వస్తే తూకం వేయాలని పేర్కొన్నారు. కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకె ట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, విండో చైర్మన్లు గుర్నాథం మల్లారెడ్డి, ఏలేటి నర్సింహారెడ్డి ఉన్నారు.