
నేటి ప్రజావాణి రద్దు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలెవరూ వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో భూభారతి అవగాహన సదస్సుల నిర్వహణలో అధికారులు నిమగ్నమై ఉన్నందున ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు వివరించారు.
ఘనంగా భరణి నక్షత్ర వేడుకలు
ధర్మపురి: భరణి నక్షత్రం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం యమధర్మరాజు ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్ శర్మ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, సూపరింటెండెంట్ కిరణ్, సిబ్బంది తదితరులున్నారు.
భారీ ఈదురు గాలులకు నేల రాలిన మామిడి
సారంగాపూర్: సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లో ఆదివారం ఉదయం వీచిన ఈదురుగాలులతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. స్వల్పంగా వర్షం కురిసినప్పటికీ ఈదురుగాలులకు కాయలు నేల రాలాయి. రైతులు వాటిని కుప్పగా వేసి, దళారులకు కిలోకు రూ.5 నుంచి రూ.10 చొప్పున విక్రయించారు. సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లో 1500 ఎకరాల్లో రైతులు మామిడి పంటలు సాగుచేశారు. ఏటా మామిడి రైతులకు ఈదురుగాలులు, అకాల వర్షాలతో కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ముగిసిన శ్రీసూక్త కోటి పారాయణం
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీసూక్త కోటి పారాయణం ఆదివారం ముగిసింది. మాధవానంద స్వామివారి సంకల్పం మేరకు శ్రీరుద్రసూక్త కోటి సామూహిక పారాయణ గ్రూప్ ప్రారంభించి 143 రోజులు పూర్తయ్యింది. 5,823 పారాయణాలతో నాలుగో మహారుద్రాలను పూర్తి చేశారు. ధర్మపురిలోని వేద పండితులు, పురోహితులు, భక్తులు హాజరయ్యారు.
ఉగ్రదాడి మృతులకు నివాళి
మల్లాపూర్: పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణా లు కోల్పోయిన పర్యాటకులకు ఆదివారం మల్లాపూర్ మండలంలోని రేగుంటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు రాజోజి సదానందచారీ, దురిశేట్టి శ్రీనివాస్, లక్ష్మణ్, నరేంద్ర, వినోద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు