
ఫిలిప్పీన్స్‌కు జగిత్యాల రా రైస్
● ఇప్పటికే ఫిలిప్పీన్స్ తరలిన 1,000 టన్నుల బియ్యం
జగిత్యాలరూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైస్‌మిల్లర్ల వద్ద ఉన్న రా రైస్ బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి పంపిస్తోంది. గతంలోనే ఫిలిప్పీన్స్ అధికారుల బృందం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి రైస్‌మిల్లుల్లో ఉన్న రా రైస్‌ను పరిశీలించి వెళ్లారు. బియ్యం నాణ్యత ప్రమాణాలు బాగుండడంతో ఇప్పటికే 12,500 మెట్రిక్ ట న్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఇటీవలే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిలిప్పీన్స్ పంపించా రు. ఫిలిఫిన్స్ చేరిన బియ్యాన్ని అక్కడి అధికారుల బృందం పరిశీలించి, తెలంగాణ రాష్ట్రంలోని రా రైస్ బియ్యం మరో 83వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అయా జిల్లాల నుంచి రా రైస్ బియ్యాన్ని సేకరించాలని పౌరసరఫరాలశాఖ అధికారులకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి 5,800 మెట్రిక్‌టన్నుల బియ్యం ఫిలిప్పీన్స్ తరలించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. బియ్యాన్ని త్వరలో సేకరించి లారీల ద్వారా కాకినాడ పోర్టుకు చేర్చనున్నారు. అక్కడి నుంచి షిఫ్‌ల ద్వారా ఫిలిప్పీన్స్ దేశానికి తరలించనున్నారు. గతంలో జగిత్యాల జిల్లా నుంచి 1000 మెట్రిక్ టన్నుల రారైస్‌ను కేఎల్ గ్రూ పు సంస్థ ఇప్పటికే ఫిలిప్పీన్స్ దేశానికి పంపించింది. దీంతో జిల్లాలో మిల్లర్ల ఉన్న రా రైస్‌ను పూర్తిస్థాయిలో సేకరించి ఫిలిప్పీన్స్‌కు రవాణా చేయనున్నారు.