తల్లీ బైలెల్లినాదో..
● అద్దకానికి తరలివెళ్లిన నీలగిరి పెద్దమ్మతల్లి ● ముత్యంపేట నుంచి శోభాయాత్ర ● మెట్‌పల్లికి చేరిన అమ్మవారు ● భారీగా తరలివచ్చిన భక్తులు ● ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసం
నీలగిరి
పెద్దమ్మతల్లిని అద్దకానికి
తరలిస్తున్న
భక్తులు
మల్లాపూర్: మల్లాపూర్ మండలం ముత్యంపేటలో నీలగిరి పెద్దమ్మతల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐదేళ్లకోసారి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని అద్దకం (కొత్తగా రంగులు వేయడం) కోసం ఆలయం నుంచి డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, అశేష భక్తజనం మధ్య శోభాయాత్రగా వేంపేట గ్రామం మీదుగా మెట్‌పల్లికి తరలించారు. అద్దకం పూర్తయిన తర్వాత మే ఒకటోతేదీన మళ్లీ శోభాయాత్రగా ముత్యంపేటకు తీసుకొచ్చి స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో తాత్కాలికంగా ప్రతిష్ఠించి మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మే 4న ఆలయానికి తరలించనున్నారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మల్లాపూర్, మెట్‌పల్లి ఎస్సైలు రాజు, కిరణ్ బందోబస్తు నిర్వహించారు. కిసాన్‌కాంగ్రెస్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ తక్కళ్ల నరేశ్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, మాజీ సర్పంచ్ బొల్లపల్లి కృష్ణవేణి పాల్గొన్నారు.
తల్లీ బైలెల్లినాదో..


