
ధర్మపురిలో జయంతి ఏర్పాట్లు
ధర్మపురి: హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా ధర్మపురిలో ఏర్పాట్లు చేశారు. శనివారం నాటి హనుమాన్ జయంతికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. గోదావరిలో స్నానాలు ఆచరించి, ఆలయాల్లో స్వామివా ర్లను దర్శించుకుంటారు. ఈ మేరకు గోదావరి ఒడ్డున చలువ పందిళ్లు, తాగునీటి వసతులు కల్పించారు. సత్యావతి, బ్రహ్మ గుండాల వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దేవస్థానం వద్ద ప్రత్యేక చలివేంద్రాలు, చలువ పందిళ్లు వేశారు.
టెండర్లకు ఆహ్వానం
ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి దేవస్థానంలో ని ర్వహించే వివిధ రకాల టెండర్లకు ఆన్‌లైన్, ఆఫ్ లైన్ల ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఈవో శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటిలో తలనీలాల సేకరణకు ఈనెల 16న బహిరంగ వేలం, సీల్డు కొటేషన్ టెండర్, ఇప్రోక్యూర్‌మెంట్ టెండర్ ఉంటుందన్నారు. సెక్యూరిటీ గార్డుల నియమకానికి ఈనెల 21న ఇప్రోక్యూర్‌మెంట్ టెండర్ నిర్వహిస్తామని తెలిపారు.