
ఓ పాఠం
గెలుపు ఓటమి
ఆవేశంతో జీవితాలను అంతం చేసుకోవద్దు.. ఆలోచన.. ధైర్యంతో అడుగు ముందుకేస్తే ఎన్నో విజయాలు మీ సొంతం. చరిత్ర.. గతం.. వర్తమానం చూస్తే అనేక విషయాలు ఇట్టే దోహదపడుతాయి. ఎందుకు పనికిరారు అని పలువురితో ఛీత్కారాలు ఎదుర్కున్నవారు కష్టపడి విజయ తీరాలకు చేరుతున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. గెలుపు.. ఓటమికి నాంది అనేదానిని మరవొద్దు. సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు. పదోతరగతి కూడా పాస్‌కాలేని ఆయన బ్యాట్ ఝలిపిస్తే.. పరుగుల వర్షమే కురిసేది. క్రికెట్ ఆడితే లక్షల కళ్లు ఆయనవైపే ఉండేవి. ఎన్నో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆయన క్రికెట్ దిగ్గజంగా ఎదిగిన విషయం మరవొద్దు.. అంతేకాదు.. శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మోటార్ న్యూరాన్ అనే వ్యాధి బారినపడ్డా.. మనోధైర్యం కోల్పోలేదు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆయన గొప్ప పరిశోధకుడై ప్రపంచమే మెచ్చుకునే వాడయ్యాడు.
ఫెయిలయ్యామని కుంగిపోవద్దు ● పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏమీలేదు
ఇంటర్
ఈ ఏడాది ఇంటర్, పదోతరగతి
పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య
హుజూరాబాద్:
ప్రతిభ కొందరికే పరిమితం కాదు. ప్రతీ మనిషిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని వెలికితీసి, కఠోర సాధన చేస్తే జీవితంలో గొప్పవ్యక్తిగా ఎదగొచ్చు. అలా కాదని నేనేం చేయలేను.. నాతో కాదు.. నేనింతే అంటూ కుంగిపోవద్దు. చదువూ అంతే.. పుస్తకాన్ని నేస్తంగా మలు చుకుని చదివితే విజయం నీ బానిస అవుతుంది. పరీక్ష నీతో స్నేహం చేస్తుంది. ఫలితం ఎప్పుడూ నీ వెంటే నడుస్తుంది. విద్యార్థులకు ‘పరీక్ష’కాలం ముగిసింది. ఫలితాల సమయం సా గుతోంది. మంగళవారం నాటి ఇంటర్ ఫలితాల్లో చాలా మంది ప్రతిభ చూపారు. కొందరు ఫెయిలయ్యా రు. త్వరలో పదోతరగతి ఫలితాలు రానున్నాయి. ఫలితాలను జీవితంలో ఒక భాగం మా త్రమే చూడాలి. ఓటమి గెలుపునకు గట్టి పునాది గా మారుతుందని గ్రహించాలి. మళ్లీ ప్రయత్నించి, తప్పులను సవరించుకుని, కన్నీళ్లు పెట్టుకు న్న చోట తలెత్తుకుని చూడాలి తప్పా.. విఫల మయ్యామని కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. గెలుపైనా ఓటమైనా.. ఓ పాఠంగా నేర్చుకోవాలి.
కరీంనగర్
పెద్దపల్లి
జగిత్యాల
సిరిసిల్ల

ఓ పాఠం

ఓ పాఠం

ఓ పాఠం

ఓ పాఠం

ఓ పాఠం

ఓ పాఠం