
కారు బోల్తాపడి 9 మందికి గాయాలు
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామ శివారులో బైక్‌ను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తాపడగా 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన మురళీకృష్ణ, దివ్య, బావిక, శ్రీకృష్ణ, మహరాజు, స్వీటి, బేబితో పాటు మరికొంత మంది వేములవాడలో కేశఖండనం కోసం వచ్చారు. శుక్రవారం ఉదయం కేశఖండన పూర్తికాగానే తమ కారులో కొండగట్టుకు వస్తుండగా చెప్యాల శివారులో అకస్మాత్తుగా ద్విచక్రవాహనం కారుకు అడ్డు రావడంతో తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లి బోల్తాపడింది. కారులోని 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.