
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దొంగల అరెస్టు
కరీంనగర్‌క్రైం: రెండు వేర్వేరు దొంగతనం ఘటనల్లో నిందితులను కరీంనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయగా.. వారి నుంచి 250 గ్రాముల బంగారం, రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సీపీ గౌస్ ఆలం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రెండు ఘటనల్లో నిందితుల వివరాలు వెల్లడించారు. కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలోని బస్టాండులో చిగురుమామిడి మండలం నవాబ్‌పేటకు చెందిన కంది సంపత్‌రెడ్డి(48) ఫిబ్రవరి 14న ఒక మహిళ బ్యాగు నుంచి 16.5 తులాల బంగారం, ఫిబ్రవరి 24న కరీంనగర్ బస్టాండుకు వచ్చి ఒక మహిళ బ్యాగు నుంచి 47 గ్రాముల బంగారం, ఏప్రిల్ 8న ఒక వృద్ధుడి బ్యాగు నుంచి రూ.13లక్షలు దొంగిలించాడు. ఈ మూడు ఘటనలపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సంపత్‌రెడ్డిని కమాన్ చౌరస్తా వద్ద సీఐ కోటేశ్వర్ బృందం పట్టుకొని అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి 150 గ్రాముల బంగారం, రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో కరీంనగర్ టూటౌన్ పరిధిలో ఈనెల 13న సప్తగిరికాలనీలో ఒక ఇంట్లోకి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం అశోక్‌నగర్‌క్ చెందిన సూర రవి(35) అనే నిందితుడు చొరబడి 175 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు రూ.35వేల నగదు అపహరించుకుపోయాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు రవిని పద్మనగర్ చౌరస్తా వద్ద శుక్రవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 100 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు బిల్ల కోటేశ్వర్, సృజన్‌రెడ్డి, సీసీఎస్ సీఐ బొల్లం రమేశ్ పాల్గొన్నారు. సిబ్బంది కుమార్, అనిల్‌రెడ్డి, సురేందర్‌పాల్, మల్లయ్య, సాయికుమార్‌తోపాటు పలువురిని ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందించారు.