
చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ
● ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
మల్లాపూర్(కోరుట్ల): వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలకు రజతోత్సవ సభ కరపత్రాలను అందించి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమాల్లో ఐకేపీ ఏపీఎం దేవరాజ్, సీసీ స్రవంతి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, నాయకులు కాటిపెల్లి ఆదిరెడ్డి, దేవ మల్లయ్య, ఏనుగు రాంరెడ్డి, ముద్దం శరత్‌గౌడ్, బండి లింగస్వామి, ద్యాగ గంగారెడ్డి, కోమ్ముల జీవన్‌రెడ్డి, డబ్బా రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రా ల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నా రు. శుక్రవారం మండలంలోని కుస్తాపూర్, రత్నాపూర్ గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించి ధా న్యం తేమశాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కేంద్రాల్లో ఏ గ్రేడ్ రకం ధా న్యం క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 కనీస మద్దతు ధర అందిస్తారని తెలిపారు.