
సైక్లింగ్‌తో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం
మల్లాపూర్(కోరుట్ల): రోజూ సైక్లింగ్ చేయడంతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వాల్గొట్ కిషన్ అన్నారు. శుక్రవారం సైకిల్‌పై నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చేరుకుని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైక్లింగ్‌తో షుగర్, రక్తపోటు, ఊబకాయాన్ని నివారించవచ్చన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు తరిగిపోతున్న పెట్రోల్ నిల్వలను కాపాడుకోవచ్చన్నారు. ప్రజలందరూ నిత్యం సైక్లింగ్ చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని గోల్కోండ రమేశ్, ఏలేటి ప్రీతంరెడ్డి, గంధం రఘు సైక్లింగ్ చేసేందుకు ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకున్నారు.
జాతీయ పోటీలకు ఎంపిక
కరీంనగర్‌స్పోర్ట్స్: బీహార్‌లో నేటి నుంచి ఈ నెల 23వరకు జరగనున్న 47వ జాతీయస్థాయి జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో రాణించిన నాగరాజు(జగిత్యాల), కల్లేపల్లి చక్రధర్ (సిరిసిల్ల) ఎంపికై నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులను మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, బొమ్మరవేని తిరుమల తిరుపతి, కలిగేటి శ్రీనివాస్, జెట్టిపెల్లి అశోక్, అనూప్‌రెడ్డి, శ్రీనివాస్, భాస్కర్ అభినందించారు.

సైక్లింగ్‌తో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం