
సనాతన ధర్మం శాశ్వతమైనది
జగిత్యాలటౌన్: సనాతన ధర్మం శాశ్వతమైనదని బీజేపీ సీనియర్ నాయకులు రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు శ్రీకోదండరామాలయ సమీపంలో 41 అడుగుల సనాతన ధర్మధ్వజాన్ని వేదపండితులు నంబివేణుగోపాలాచార్య కౌశిక, బ్రహ్మశ్రీ తిగుళ్ల విశుశర్మ వేద మంత్రోచ్ఛరణ మధ్య శనివారం ఆవిష్కరించారు. దేశంలో ఉంటూ కొందరు దేవుడి ఉనికిపై, భారతీయ విలువలపై దాడులు చేసేందుకు యత్నించడం దురదృష్టకరమన్నారు. ద్వజస్తంభ ఏర్పాటులో సహకరించిన మ్యాన మహేష్, చిప్పరి రాజును అభినందించారు. బీజేపీ సీనియర్ నాయకులు ఏసీఎస్ రాజు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వ సంత, మ్యాన మహేష్, వొద్దినేని శ్రీలత, సీపె ల్లి రవీందర్, లింగంపేట శ్రీను, గుర్రం రా ము, వేముల సంతోష్, చొప్పరి రాజు, బ్ర హ్మాండభేరి నరేష్, గాజోజు సంతోష్, గడ్డల లక్ష్మి, బిట్టు, బుర్ర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.