
ఫసల్ బీమా అమలు చేస్తే రైతులకు పరిహారం అందేది
● నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
ఇబ్రహీంపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తే రైతులకు పంట నష్ట పరిహారం అందేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో నష్టపోయిన పంటలను ఎంపీ సోమవారం పరిశీలించారు. పంట నష్టంపై సత్వరమే సర్వే నిర్వహించి ఎకరాకు రూ.50వేల చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు, మండల అధ్యక్షుడు బాయి లింగారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరేందర్‌రెడ్డి, నాయకులు రఘు, సుకేందర్‌గౌడ్, వొడ్డెపల్లి శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నృసింహుని సన్నిధిలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామిని సోమవారం రాష్ట్ర రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయం తరఫున చైర్మన్ జక్కు రవీందర్ వారికి స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం అందించారు. జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు పుల్లూరి సత్యనారాయణ, అర్చకులు నంబి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జడ్జి పూజలు
నృసింహస్వామిని మంచిర్యాల జడ్జి అర్పిత దర్శించుకున్నారు. ఈవో శ్రీనివాస్ ఆమెకు స్వాగతం పలికి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.
తేమశాతం వచ్చిన ధాన్యం కొనండి
మెట్‌పల్లిరూరల్: తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్‌పల్లి మండలం మేడిపల్లి, సత్తక్కపల్లి గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోళ్లలో జాప్యం చేయవద్దని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. రైతులు దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, ఏపీఎం విమోచన, ఏఈవో మనోజ్ఞ, మాజీ ఎంపీపీ సాయిరెడ్డి, నాయకులు ఆరెళ్ల రాజాగౌడ్, గంగాధర్, శ్రీధర్, లింగారెడ్డి, ఖుతుబొద్దీన్‌పాషా, తదితరులు పాల్గొన్నారు.
భారీ వాహనాలు రాకుండా..
ధర్మపురి: నృసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. భారీ వాహనాలతో భక్తులు, వ్యాపారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో నంది చౌరస్తా నుంచి నృసింహుని ఆలయం వరకు.. అక్కడి నుంచి బ్రాహ్మణ సంఘం వరకు భారీ వాహనాలు రాకుండా కట్టుదిట్టమైన ఐరన్ పైపులు అమర్చారు. వాటి వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీఐపీలు, వికలాంగులు, వృద్ధులకు వెసులుబాటు కల్పించారు. భక్తుల వాహనాలను బ్రాహ్మణసంఘం, నైట్ కాలేజీ వద్ద నున్న పార్కింగ్‌లో పెట్టుకోవాలని సూచించారు. స్థానికులకు షరతులు ఉండవని తెలిపారు.

ఫసల్ బీమా అమలు చేస్తే రైతులకు పరిహారం అందేది

ఫసల్ బీమా అమలు చేస్తే రైతులకు పరిహారం అందేది

ఫసల్ బీమా అమలు చేస్తే రైతులకు పరిహారం అందేది