
‘బీజేపీ బలోపేతానికి కృషి’
జగిత్యాలటౌన్: జిల్లాలో బీజేపీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చా రు. జగిత్యాలలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మె ల్యే దన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని మోడీ యకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, సత్యనారాయణరావు, కొక్కు గంగాధర్, రఘు, కన్నం అంజయ్య, గడ్డల లక్ష్మి పాల్గొన్నారు.