
జర్నలిస్టుల పరిస్థితి దుర్భరం
వేములవాడ: రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వేములవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తే జర్నలిస్టులను ఆదుకుంటామన్నారు. జర్నలిజం అనుభవం లేకున్నా యూట్యూబ్ చానళ్ల ముసుగులో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి గతంలో రూ.10 లక్షల మేరకు ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేశారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్ అధ్యక్షతన బండి సంజయ్‌ని సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాయకులు ప్రతాప రామకృష్ణ, కుమ్మరి శంకర్, వికాస్‌రావు, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు.
ప్రసాద్ స్కీంలోకి రాజన్న గుడి
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ప్రసాద్‌స్కీంలో చేర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కరీంనగర్‌టౌన్: దేశ చరిత్రలో అంబేడ్కర్ ఎదుర్కొ న్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తన మేధాశక్తిని అణగారిన వర్గాల అ భ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అని కొని యాడారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్‌లో నిర్వహించిన సెమినార్‌కు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేడ్కర్‌ను దళిత జాతికే పరిమి తం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. చరిత్ర అంటే డూప్లికేట్ గాంధీ కుటుంబానిదే అన్నట్లుగా విపరీతమైన ప్రచారం చేసుకుని ఆయన్ను తక్కువ చేసిందన్నారు. కాంగ్రెస్ తీరుతో విసుగుచెంది రాజీనామా చేసి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసిన రెండుసార్లు అంబేద్కర్‌ను ఓడించిందన్నారు. డూప్లికేట్ గాంధీ కుటుంబసభ్యులైన నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకుందన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్రలు చేసిందన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న వచ్చేలా చేసిన పార్టీ బీజేపీ అని అంబేడ్కర్ జయంతి రోజు రాష్ట్రీయ సమరసత దినంగా ప్రకటించి 120దేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, మానేరు అనంతరెడ్డి, దేవేందర్ రావు, అడవి కుమార్, డాక్టర్ గంగాధర్, రాజేందర్‌రెడ్డి, సోమిడి వేణు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని విధాలా ఆదుకుంటాం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యలు