
సత్తాచాటిన ‘రెసోనెన్స్’ విద్యార్థులు
కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని కోట ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలోని రెసోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారని కళాశాల చైర్మన్ డి.అంజిరెడ్డి తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఎంపీసీలో టి.భావన, జి.సాయిఅక్షిత్, కె.సహనశ్రీ, యూ.అహన్య, ఎన్.శ్రీఅక్షిత, పి.సంజన 467/470 మార్కులు, కె.కీర్తన, ఎం.అక్షయ, కె.అక్షయవర్దన్, బి.సహశ్రీ, టి.విజయవర్దన్, ఎం.నివ్యరెడ్డి, కె.సాత్విక్, సిహెచ్ హాస్యరెడ్డి 466/470 మార్కులు, ఏడుగురు 465, 10 మంది 464 మార్కులు సాధించారన్నారు. బైపీసీలో ఎం.శ్రీష 436, బి.సాయిత్రిపుర 435, వై.వంశిక, ఎం.సంజనా నాయక్, ఎం.తేజస్వీనిలు432 మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్‌లో ఎం.శ్రీనిత, ఎస్.శృతిలు 987/1000 మార్కులతో పాటు ఆరుగురు 980 ఆపై మార్కులు సాధించినట్లు తెలిపారు.