26 క్రీడాంశాలు.. 889 సీట్లు | - | Sakshi
Sakshi News home page

26 క్రీడాంశాలు.. 889 సీట్లు

Published Thu, Apr 24 2025 12:26 AM | Last Updated on Thu, Apr 24 2025 12:26 AM

26 క్రీడాంశాలు.. 889 సీట్లు

26 క్రీడాంశాలు.. 889 సీట్లు

కోచ్‌గా మారేందుకు కేరాఫ్‌ ఎన్‌ఎస్‌ ఎన్‌ఐఎస్‌

26లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ

కరీంనగర్‌స్పోర్ట్స్‌: దేశంలో క్రీడారంగానికి పెద్దన్న ఎన్‌ఐఎస్‌. క్రీడాకారులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించి ఒలింపిక్స్‌తో పాటు ప్రపంచ క్రీడావేదికల్లో భారత పతాకం రెపరెపలాడేలా తీర్చిదిద్దుతుంది. క్రీడాకారులకు ఎన్‌ఐఎస్‌ నుంచి పిలుపువచ్చిందంటే అదృష్టమే. దేశవ్యాప్తంగా కోచ్‌లను తయారు చేసేందుకు ఏటా కొన్ని క్రీడాంశాల్లో నిష్ణాతులైన క్రీడాకారులకు, అర్హులైన వారికి డిప్లొమా కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. పీఈటీలుగా మారాలనుకునే వారు పీఈసెట్‌ రాసి ట్రైనింగ్‌ చేసి డీఎస్సీ ద్వారా డ్రిల్‌ మాస్టర్లుగా మారుతారు. దేశవ్యాప్తంగా ఉన్న స్టేడియాల్లో కోచ్‌లుగా నియామకం కావడానికి ఈ డిప్లొమా కోర్సులు దోహదపడుతుంటాయి. 2025–26 ఏడాదికి నేతాజీ సుభాష్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. 63వ డిప్లొమా బ్యాచ్‌కు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

26 క్రీడాంశాల్లో..

దేశవ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో డిప్లొమా కోచింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. పంజాబ్‌లోని పాటియాలలో ఎన్‌ఎస్‌ ఎన్‌ఐఎస్‌ సెంటర్‌, బెంగళూర్‌లోని సాయ్‌ ఎన్‌ఎస్‌ఎస్‌సీ సెంటర్‌, కోల్‌కత్తాలోని సాయ్‌ ఎన్‌ఎస్‌ఈసీ సెంటర్‌, తిరువంతపురంలోని సాయ్‌ ఎల్‌ఎన్‌సీపీఈ సెంటర్లలో కోర్సుల కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 26 క్రీడాంశాల్లో శిక్షణనివ్వనున్నారు. మొత్తం 785 సీట్లతో పాటు 104 అదనపు సీట్లు (ఒలింపిక్స్‌, ప్రపంచస్థాలో ఆడిన వారికి) కలిపి మొత్తం 889సీట్లు అందుబాటులో ఉన్నాయి.

సీట్ల వివరాలు

అర్చరీ(30), అథ్లెటిక్స్‌(75), బ్యాడ్మింటన్‌(20), బాస్కెట్‌బాల్‌(30), బాక్సింగ్‌(50), కనోయింగ్‌–కయాకింగ్‌(15), సైక్లింగ్‌(30), ఫెన్సింగ్‌(30), ఫుట్‌బాల్‌(50), జిమ్నాస్టిక్స్‌(20), హ్యాండ్‌బాల్‌(20), హాకీ(50), జూడో(30), కబడ్డీ(30), ఖోఖో(20), రోయింగ్‌ (10), షూటింగ్‌ (20), స్విమ్మింగ్‌(20), టేబుల్‌టెన్నిస్‌(40), తైక్వాండో(20), టెన్నీస్‌ (20), వాలీబాల్‌(30), వెయిట్‌ లిఫ్టింగ్‌ (30). రెజ్లింగ్‌(50), ఉషూ(25), యోగాసన(20) సీట్లు ఉన్నాయి.

అర్హత వివరాలు...

అభ్యర్థి వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్‌, డిగ్రీ అర్హతతో పాటు ఒలింపిక్స్‌, ప్రపంచస్థాయి, జాతీయ స్పోర్ట్స్‌ ఆచీవ్‌మెంట్‌ సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో నమోదు చేయాలి. రాత, ప్రాక్టికల్‌, మౌఖిక పరీక్షలతోపాటు మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

సామర్థ్య పరీక్షలు

పురుష, మహిళా అభ్యర్థులకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టులు నిర్వహిస్తారు. 30 మీటర్ల ఫ్లయింగ్‌ స్ప్రింట్‌, స్టాండింగ్‌ బ్రాడ్‌జంప్‌, షటిల్‌రన్‌, బెండ్‌ అండ్‌ రీచ్‌ టెస్ట్‌, 1600మీటర్ల పరుగు పరీక్షలు నిర్వహిస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్‌ 26

సవరణ తేదీ ఏప్రిల్‌ 27,28

పరీక్ష తేదీ జూన్‌ 6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement