రోళ్లవాగును పూర్తిచేయండి
సారంగాపూర్: బీర్‌పూర్ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అధికారులకు సూచించారు. మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించినా వ్యయం రూ.60కోట్ల నుంచి రూ.131కోట్లకు చేరిందని, అయినా అటవీశాఖ అనుమతులు పొందలేదని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చొరవతో అన్ని అనుమతులు పొంది రూ.153 కోట్లతో పాలన అనుమతులు వచ్చాయని తెలిపారు. ఆ నిధులతో మూడు గేట్లను వెంటనే బిగించాలని కోరారు. సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ పొల్సాని నవీన్‌రావు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్ పాల్గొన్నారు.


