
ప్రజల కోరిక మేరకే జగ్జీవన్‌రాం విగ్రహ ఏర్పాటు
జగిత్యాలటౌన్: జిల్లా ప్రజల కోరిక మేరకే జిల్లాకేంద్రంలోని మంచినీళ్ల బావి చౌరస్తాలో బాబు జగ్జీవన్‌రాం విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి శనివారం స్థల పరిశీలన చేశారు. సామాజిక న్యాయం కోసం బాబు జగ్జీవన్‌రాం చేసిన పోరాటం ముందుతరాలకు ప్రేరణగా ఉంటుందన్నారు. జగ్జీవన్‌రాం సేవలు చిరస్మరణీయంగా ఉండేలా విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.
గర్భాశయ క్యాన్సర్ నివారణకు కృషి చేద్దాం
జగిత్యాల: గర్భాశయ క్యాన్సర్ నివారణకు కృషి చేద్దామని, సర్వైకల్ క్యాన్సర్ ముక్త్‌భారత్ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్ అన్నారు. శనివారం ఐఎంఏ హాల్‌లో గైనకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్‌తో రోజురోజుకూ మరణాలు పెరిగిపోతున్నాయని, ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. గైనకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మిని మాట్లాడుతూ 9 నుంచి 45ఏళ్ల వారు వ్యాక్సిన్ తీ సుకోవచ్చన్నారు. అనంతరం 20 మంది మహిళలకు వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, కోట గిరి సుధీర్‌కుమార్, వినీల, నాగరత్న, సాయిసుధ పాల్గొన్నారు.
అంజన్న కృపతో ప్రజలకు మేలు చేకూరాలి
మల్లాపూర్: అంజనేయస్వామి కృపతో ప్రజ లకు మేలు చేకూరాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఖాదీ బోర్డు చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మండలంలోని రాఘవపేటలో శనివారం నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో సతీసమేతంగా పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదన్నారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మెట్‌పల్లి మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు నత్తి నర్సయ్య, బైరి రవికుమార్, గురిజేల లక్ష్మీనారాయణ, హనుమాన్ దీక్షదారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల కోరిక మేరకే జగ్జీవన్‌రాం విగ్రహ ఏర్పాటు