
ఎండకు పక్షుల మృత్యువాత
కోనరావుపేట(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని గ్రామాల్లో ఎండల తీవ్రతకు పక్షులు నేలరాలుతున్నాయి. నెమళ్లు, కాకులు, పిచ్చుకలతో పాటు ఇతర పక్షులు అస్వస్థతకు గురవుతున్నాయి. మర్తనపేట శివారులోని రైస్‌మిల్లువద్ద ఓ నెమలి ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురికాగా గమనించిన యువకులు రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు.
విండో చైర్మన్ రూ.7.23 లక్షలు దుర్వినియోగం
● గతేడాది డిసెంబర్‌లో పలువురు డైరెక్టర్ల ఫిర్యాదు
సారంగాపూర్(జగిత్యాల): మండలంలోని కోనాపూర్ సింగిల్‌విండోలో విండో చైర్మన్ గుర్నాథం మల్లారెడ్డి రూ.7,23,638 నిధులు దుర్వినియోగం చేసినట్లు జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ వెల్లడించారు. చైర్మన్ అక్రమాలకు పాల్పడినట్లు జరిపిన విచారణ నివేదికను శుక్రవారం వెల్లడించారు. అక్రమాలపై విండో పరిధిలోని పలువురు డైరెక్టర్లు 2024 డిసెంబర్ 16న కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయికుమార్‌గౌడ్ విచారణ చేపట్టారు. 2021 నుంచి 2024 వరకు చైర్మన్ రూ.7,23,638 వివిధ రూపాల్లో దుర్వినియోగం చేసినట్లు నిర్ధారించడం జరిగిందని వివరించారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 21న ఉదయం 11 గంటలకు జిల్లా సహకార కార్యాలయంలో చైర్మన్ హాజరుకావాలని, లేకుంటే 18 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
రాజన్నను దర్శించుకున్న సినీ ప్రముఖులు
వేములవాడ: వేములవాడ రాజన్నను శుక్రవారం సినీ పరిశ్రమకు చెందిన సంపత్ నంది, దర్శకుడు అశోక్ తేజ, ప్రొడ్యూసర్ డి.మధు, వశిష్ట సింహ హీరోలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు.

ఎండకు పక్షుల మృత్యువాత

ఎండకు పక్షుల మృత్యువాత