గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Published Sun, Apr 20 2025 2:07 AM | Last Updated on Sun, Apr 20 2025 2:07 AM

గుండె

గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

ధర్మపురి: శుభకార్యం కోసం స్వగ్రామానికి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంఘటన ధర్మపురిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన దెహగం గిరీశ్‌ (40) కొన్నాళ్లు అమెరికా, పూణేలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని బోయింగ్‌ (విమానాలు తయారు చేసే కంపెనీ)లో భార్యతోపాటు పనిచేస్తున్నాడు. వీరికి కూతురు సంతానం. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో గురువారం భార్య, కూతురుతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. శు క్రవారం పొద్దంతా బంధువులందరితో ఆనందంగా గడిపాడు. రాత్రి సమయంలో సొంత అ న్నయ్య గణేశ్‌ ఇంటికి వెళ్లాడు. ఆయనతో మా ట్లాడుతుండగానే గుండెపోటుతో కుప్పకూలి పోయాడు. గణేశ్‌ వెంటనే ఆయనకు సీపీఆర్‌ చే సి వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. అప్పటిదాకా అందరితో కలిసిమెలి సి ఉండి అంతలోనే అనంతలోకాలకు చేరడంతో బంధువులు శోకసంద్రంలో మునిగి పోయారు. విప్‌ లక్ష్మణ్‌కుమార్‌, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి తదితరులు గిరీశ్‌ మృతిపట్ల సానుభూతి తెలిపారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.

చేపల వేటకు వెళ్లి బాలుడు..

కొత్తపల్లి(కరీంనగర్‌): చేపల వే టకు వెళ్లి ఓ బాలుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల వివరాలు.. కరీంనగర్‌లోని రేకుర్తి 18వ డివిజన్‌కు చెందిన మహ్మద్‌ అహిల్‌ అజ్మన్‌(11), మహ్మద్‌ అన్సర్‌, ఎండీ ఆర్మన్‌ శనివారం ఉదయం వెంకటేశ్వరకాలనీ శ్మశానవాటిక సమీపంలోని బావిలో చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహ్మద్‌ అహిల్‌ అజ్మన్‌ ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడ్డాడు. ఆందోళనకు గురైన ఇరువురు కేకలు వేయడంతో పాటు స్థానికులకు తెలిపారు. అక్కడున్న బీఆర్‌ఎస్‌ నాయకుడు కృష్ణగౌడ్‌ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. బాలుడి కోసం బావిలో వెతగగా మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కలెక్టర్‌ కారుకు ఫైన్‌

గోదావరిఖని: కలెక్టర్‌ కారు వేగంగా వెళ్తోంది. హైవే వెంట నిర్ణీత స్పీడ్‌ను మించి ప్రయాణించడంతో పోలీసులు ఇటీవల ీస్పీడ్‌గన్‌ ద్వారా వేగాన్ని గుర్తించి నాలుగు ఫైన్‌లు వేశారు. ప్రధానంగా పెద్దపల్లి నుంచి కరీంనగర్‌వైపు వెళ్తుండగా, ముగ్ధుంపూర్‌వైవు వెళ్తుండగా మూడు ఫైన్లు విధించారు. అలాగే నుస్తులాపూర్‌ వద్ద హైస్పీడ్‌తో వెళ్తుండగా మరో ఫైన్‌ పడింది. టీఎస్‌ –220001 ఇన్నోవా వాహనంపై నాలుగు ఫైన్‌ల పేరిట రూ.4,140 ఫైన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఓ మీటింగ్‌కు వచ్చిన కలెక్టర్‌ కారును స్థానికులు ఈ – చాలన్‌లో చెక్‌చేయగా ఇవి బయపడ్డాయి.

సప్తగిరి ఆస్పత్రి గుర్తింపు రద్దు

జమ్మికుంట(హుజూరాబాద్‌): పట్టణంలోని సప్తగిరి ఆస్పత్రిలో సీఎంఆర్‌ఎఫ్‌ నకిలీ బిల్లుల సృష్టించి డబ్బులు కాజేసిన వ్యవహారంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆస్పత్రి గుర్తింపును రద్దు చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.చందు తెలిపారు. శనివారం ఆస్పత్రిని పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణ చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా నకిలీ బిల్లుల వ్యవహారంపై 2023లో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. నకిలీ బిల్లులతో డబ్బులు కాజేసినట్లు విచారణలో తేలింది.

గుండెపోటుతో   సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి1
1/2

గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

గుండెపోటుతో   సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి2
2/2

గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement