
సిబ్బంది కొరత తీర్చాలి
బొమ్మెన గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో సిబ్బంది లేక జేఎల్‌ఎంలతో తాత్కాలికంగా నెట్టుకొస్తున్నారు. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద, గ్రామంలో వైర్ల సమస్య వస్తే సబ్‌స్టేషన్ నుంచి జేఎల్‌ఎంలు పరుగెత్తుకుంటూ వస్తున్నారు. కరెంట్ సమస్యలు వస్తే అత్యవసరంగా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రతీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సరిపడేలా సిబ్బందిని నియమించాలి.
– అల్లూరి బాపురెడ్డి, రైతు, బొమ్మెన
ఉన్నతాధికారులకు నివేదించాం
విద్యుత్ సబ్‌స్టేషన్‌లలో ఆర్టిజియన్‌ల కొరత విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ఆర్టిజియన్ల కొరత ఉంటే ఆయా గ్రామాల జేఎల్‌ఎంలు సబ్‌స్టేషన్‌లలో విధులు నిర్వర్తించాల్సిందే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జేఎల్‌ఎంలకు సబ్‌స్టేషన్‌లలో విధులు కేటాయిస్తున్నాం. విద్యుత్ సమస్యలుంటే ప్రజలు చెప్పగానే పరిష్కారానికి కృషి చేస్తున్నాం.
– రఘుపతి, ట్రాన్స్‌కో ఏడీఈ, కోరుట్ల రూరల్

సిబ్బంది కొరత తీర్చాలి