
ఉగ్రవాదుల దిష్టిబొమ్మల దహనం
జగిత్యాల/మెట్‌పల్లి: జమ్ముకాశ్మీర్‌లో పర్యాటకులపై పాకిస్తాన్ ముష్కరులు చేసిన దాడిలో చనిపోయిన వారికి బీజేపీ, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉగ్రవాదులను ఉపేక్షించొద్దన్నారు. మెట్‌పల్లిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ నాయకులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్, నాయకులు దొనికెల నవీన్ ఉన్నారు. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి పాత బస్టాండ్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు నివాళులర్పించారు. మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ఉగ్రవాదుల దిష్టిబొమ్మల దహనం

ఉగ్రవాదుల దిష్టిబొమ్మల దహనం