
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
జగిత్యాలరూరల్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం నర్సింగపూర్, వెల్దుర్తి, వంజరిపల్లి, జాబితాపూర్, ధర్మారం గ్రామాల్లో మంగళవారం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే గన్నీ బ్యాగులను కేంద్రాలకు తరలించామని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, ఏపీఎం గంగాధర్, సీసీ మరియ, నాయకులు మహేశ్, మల్లారెడ్డి, శంకర్‌రెడ్డి, మల్లేశంగౌడ్, నరేశ్, ప్రవీణ్‌గౌడ్, ప్రకాశ్, మమత పాల్గొన్నారు.