
ఆడ బిడ్డలకు అండగా ప్రభుత్వం
వెల్గటూర్: పేదింటి ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం, కల్యాణ లక్ష్మి పథకం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఎండపల్లి తహశీల్దార్ కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కల్యాణలక్ష్మి లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని, అక్కడికక్కడే సంతకాలు పెట్టి పంపిస్తున్నామని, గత పాలకుల మాదిరిగా ఇబ్బందులకు గురిచేయడం లేదని తెలిపారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రేషన్‌కార్డు ఉన్న పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం కాదుకదా కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేసి చరిత్ర సృష్టించిందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ గోపిక, తహసీల్దార్ రవికాంత్, నాయకులు గోపాల్‌రెడ్డి, తిరుపతి, రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి భూమిపూజ
వెల్గటూరు మండలంలోని మొక్కట్రావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించనున్న హనుమాన్ ఆలయానికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ శుక్రవారం భూమిపూజ చేశారు. ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు పొనుగోటి శ్రీని వాసరావు, మద్దుల గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్