
ప్రజల భాగస్వామ్యంతోనే పాఠశాలలు బలోపేతం
వెల్గటూర్: ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని డీఈవో కే.రాము పేర్కొన్నారు. వెల్గటూర్ మండలం పాశి గామ ప్రాథమిక పాఠశాలలో గురువారం జరిగిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సహకారానికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమై పురోగతి సాధిస్తాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంత ఘనంగా వార్షికోత్సవం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అనంతరం బడిబాట కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పాఠశాల హెచ్‌ఎం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి కొక్కుల రాజేశ్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంఈవో ప్రభాకర్, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రావు, ఎంపీవో శ్రీనివాస్, ఎండపల్లి కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీనివాస్, మహేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.