
జిల్లాకు 12 మంది హెడ్‌కానిస్టేబుళ్లు
జగిత్యాలక్రైం: మల్టీజోన్–1లో పనిచేస్తున్న 28 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ మల్టీజోన్–1 ఇన్‌చార్జి, మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఒక కానిస్టేబుల్‌కు హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి రాగా.. 12 మంది ఇతర జిల్లాల్లో పదోన్నతి పొందిన వారిని జిల్లాకు కేటాయించారు. జగిత్యాలకు చెందిన వెంకటేశంకు హెడ్‌గా పదోన్నతి వచ్చింది. అలాగే ఆదిలాబాద్ నుంచి జిల్లాకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పి.శివాజీ, డి.వెంకటి, ఎ.వెంకటరమణ, నిజామాబాద్ నుంచి ఎస్.వేణుగోపాల్, ఎం.శంకర్‌రావు, ఆర్.నారాయణ, ఎండి.మహ్మద్ అలీ, ఎ.గంగాధర్, ఎ.మనోజ్, కృష్ణకుమార్, ఎస్.హరికృష్ణ రానున్నారు.