పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలి
జగిత్యాల: పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శనివారం జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఐదేళ్లలోపు పిల్లల ందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయాలని, వివిధ కారణాలతో అందుబాటులోలేని పిల్లలు, గర్భిణులకు ఏప్రిల్, మే, జూన్ 21, 28 తేదీల్లో టీకాలు ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో మహిళా సంఘాలు, రిసోర్స్ పర్సన్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు కలిసి పిల్లల డ్యూలిస్ట్ తయారు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, సమియోద్దీన్, శ్రీనివాస్, మదన్‌మోహన్, నరేశ్ పాల్గొన్నారు.
ధాన్యం తూకం వేసేందుకు చర్యలు తీసుకోండి
జగిత్యాలటౌన్: జిల్లాలోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వెంటనే తూకం వేసేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. జిల్లాలో 17శాతానికి తక్కువ తేమశాతం వస్తున్నా.. ధాన్యం తూకం వేయడం లేదన్నారు. ఈదురుగాలులు, అకాలవర్షాలు కురుస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేయాలని కోరారు.
పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలి


