
‘భూభారతి’తో భూ సమస్యలకు పరిష్కారం
వెల్గటూర్/మేడిపల్లి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంతో భూ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం వెల్గటూర్ మండల కేంద్రంలోని రైతువేదిక, మేడిపల్లిలోని బీమన్నగుడి ప్రాంతంలో అవగాహన సదస్సు నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందన్నారు. సాదాబైనామాల రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఉందన్నారు. సరిహద్దు వివాదాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు నివారణకు క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తిగా విచారణ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు గ్రామకంఠం, ఆబాది భూములకు ప్రత్యేక పాస్‌బుక్‌లు ఇవ్వనున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ శేఖర్, ఏఎంసీ చైర్‌పర్సన్ గోపిక, వైస్ చైర్మన్ తిరుపతి, సహకార సంఘాల అధ్యక్షులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
రైతు భూములకు పూర్తి భరోసా..
రైతుల భూములకు భూభారతి చట్టం భరోసా క ల్పిస్తుందని కలెక్టర్ అన్నారు. జూన్ రెండో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో పోర్టల్ అందుబాటులోకి వ స్తుందని తెలిపారు. ఏటా డిసెంబర్ 31న భూభా రతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్‌డేట్ ఉంటుందన్నారు. పోర్టల్ లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపారు.
పంట నష్టం వివరాలు నమోదు చేయాలి
ఇబ్రహీంపట్నం: వడగళ్లవాన, ఈదురు గాలులతో పంటలు నష్టపోయిన రైతుల వివరాలను న మోదు చేయాలని కలెక్టర్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. నష్టం వివరాలను వారంలోగా సిద్ధం చేసి పంపాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. జి ల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, తహసీల్దార్ ప్రసాద్, ఏడీఏ రమేశ్, ఏఓ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.