
నేటి ప్రజావాణి రద్దు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినతులు ఇవ్వడానికి ప్రజలెవరూ కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల్లో భూభారతి అవగాహన సదస్సుల నిర్వహణలో అధికారులు బిజీగా ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీనివా సుడు, శ్రీదేవి, భూదేవి కల్యాణాన్ని ఆదివారం అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అర్చకులు చక్రపాణిమాధవాచార్యులు, దివాకరాచార్యులు, మాజీ సర్పంచు దొంతుల శ్యామల తుక్కారం, మాజీ ఎంపీటీసీ పొనకంటి వెంకట్, నాయకులు మామిడి సురేశ్‌రెడ్డి, రాజన్న, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బకాయి వేతనాలు విడుదల చేయండి
జగిత్యాలటౌన్: పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోమటి చంద్రశేఖర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం పంచాయతీ కార్మికుల జిల్లా విస్తృతస్తాయి సమావేశం నిర్వహించారు. మే 20న నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాన్ని ఆవిష్కరించారు. శానిటేషన్, పంపుఆపరేటర్లు, బిల్‌కలెక్టర్, డ్రైవర్లు, కారోబార్లు, ఎలక్ట్రీషియన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఏళ్ల తరబడి సేవలందిస్తున్నా.. ఉద్యోగ భద్రత కరువైందన్నారు. కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాదబీమా అమలు కావడం లేదన్నారు. కేంద్రప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తూ కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందన్నారు. కార్యక్రమంలో జీపీ కార్మిక యూనియన్ జిల్లా కార్యదర్శి పులి మల్లేశం, నా యకులు రాజన్న, రాజేందర్, సత్తయ్య, రాజు, దేవయ్య, జోగవ్వ తదితరులు పాల్గొన్నారు.
పాలకవర్గాలు లేకనే సమస్యలు
జగిత్యాలటౌన్: స్థానిక సంస్థలకు పాలకవర్గం లేకనే గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. వీధి దీపాలు, తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాజ్యాంగ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఆదివారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో జైభీం, జైబాపు, జైసంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. గాంధీ ఆశయ సాధన కోసం జైభీం, జైబాపు, జైసంవిధాన్ కార్యక్రమాన్ని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌లో ఈనెల 22న నిర్వహించే జైబాపు, జైభీం, జైసంవిధాన్‌కు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, నాయకులు జీఆర్.దేశాయ్, మహ్మద్‌భారీ పాల్గొన్నారు.

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు