Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Merugu Nagarjuna Says Chandrababu Govt Neglecting Students Welfare1
‘తల్లికి వందనం అమలు ఎప్పుడు చంద్రబాబూ?’

సాక్షి, తాడేపల్లి: విద్యతోనే పేదరికంను నిర్మూలించాలన్న డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూసిన ఘనత వైఎస్‌ జగన్‌ది అయితే, విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైనా చంద్రబాబు కర్కశత్వం చూపుతున్నారని, విద్యార్ధుల ఉసురుపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది. సామాజిక రుగ్మతలు పోవాలంటే చదువే ప్రామాణికమని ఆనాడు బీఆర్ అంబేద్కర్ చెప్పారు. విద్యతోనే పేదల తలరాతలు మారుతాయని వైయస్ జగన్ నమ్మి, తన పాలనలో దానిని ఆచరణలోకి తీసుకువచ్చారు. సామాజిక మార్పు కోసం విద్యకు పెద్దపీట వేశారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో క్షేత్రస్థాయి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలను జమ చేయడం ద్వారా రాష్ట్రంలో గొప్ప సంస్కరణలకు ఆద్యుడు అయ్యారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించారు. ఏ కుటుంబంలో అయినా ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళేవారు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆ పిల్లల తల్లికి ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు గొప్పగా ప్రచారం చేసుకున్నాయి.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు బహిరంగసభల్లో ఏం మాట్లాడారో కూడా ఈ మీడియా సమావేశంలో ప్రజలు గమనించేందుకు వీలుగా ప్రదర్శిస్తున్నాం. అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రతి ఇంటికి వెళ్ళి 'నీకు పదిహేను... నీకు పదిహేను వేలు అంటూ' అందరినీ నమ్మించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం కింద ఇస్తామన్న సొమ్ము ఏమయ్యిందని ప్రశ్నిస్తున్నాం. సీఎం చంద్రబాబు చదువులమ్మ తల్లిని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.వాయిదాల రూపంలో ఇస్తారా..కూటమి ప్రభుత్వం మిగిలిన అన్ని హామీలతో పాటు తల్లికివందనంను కూడా గాలికి వదిలేసింది. దీనిపై మేం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంటే, ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు వంకలు వెతుకుతున్నాడు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తల్లికివందనం కింద ఇచ్చే రూ.15వేలను కూడా వాయిదాల రూపంలో ఇస్తానని మాట మార్చారు. మేం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే... 'అమ్మ ఒడి-నాన్న బుడ్డీ' అంటూ కూటమి పార్టీలు అత్యంత హేయంగా విమర్శించారు. ఇప్పుడు కూటమి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. విద్యపట్ల, విద్యార్ధుల తల్లులకు ఇచ్చే అమ్మ ఒడి పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపుకు గతంలో ఆయన చేసిన విమర్శలే నిదర్శనం.విద్యారంగానికి పెద్దపీట వేసిన వైఎస్‌ జగన్‘‘డబ్బు లేక పిల్లలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైయస్ జగన్ అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా నాలుగేళ్ల పాటు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. అయిదో ఏడాది కూడా 2024 జూన్ నాటికి ఇవ్వడానికి అన్ని సిద్దం చేసి ఎన్నికలకు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకు 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ. 26,౦67 కోట్లు జమ చేశారు. 57 నెలల్లో విద్య కోసం ఆనాడు వైఎస్‌ జగన్ జగనన్న విద్యాకానుక కోసం రూ.3366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.4417 కోట్లు, మాబడి నాడు-నేడు రెండు దశలకు కలిపి రూ. 13000 కోట్లు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కోసం రూ.6688 కోట్లు, ఆడపిల్లల నాప్‌కిన్‌ల కోసం రూ.32 కోట్లు, విద్యార్ధులకు బైజూన్ కంటెంట్ ట్యాబ్‌ల కోసం రూ.1300 కోట్లు..విద్యాదీవెన కోసం 12610, వసతి దీవెన కోసం రూ.5392 కోట్లు, విదేశీ విద్యాదీవెన కోసం రూ.107 కోట్లు ఇలా వివిధ పథకాల కోసం మొత్తం దాదాపు 72,919 కోట్లు ఖర్చు చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చదువుల కోసం, విద్యాప్రమాణాలను పెంచడం కోసం ఇలా ఖర్చు చేయలేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి అక్కచెల్లెమ్మల పిల్లలకు మేనమామగా వారి విద్యకు అండగా నిలుస్తానని ఆనాడు వైఎస్‌ జగన్ ముందుకు వచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు. తల్లికి వందనంపై రోజుకో మాట చెబుతూ, విద్యార్ధులను వారి తల్లులను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. ఇచ్చిన మాట ప్రకారం తక్షణం తల్లికి వందనం కింద విద్యార్ధులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.

Brs Silver Jubilee Meeting Elkathurthy Warangal Updates2
కేసీఆర్‌ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ

సభ ఏర్పాట్లు ఇలా..👉కేసీఆర్‌ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ👉బీఆర్‌ఎస్‌ కటౌట్లు,ఫ్లెక్సీలతో వరంగల్‌ ఎల్కతుర్తి గులాబీమయం👉సభా స్థలి విస్తీర్ణం: 1,213 ఎకరాలు👉మహాసభ ప్రాంగణం: 154 ఎకరాలు👉 ప్రధాన వేదికపై సీటింగ్‌: 500 మందికి 👉వాహనాల పార్కింగ్‌ : 1,059 ఎకరాలు 👉సభికుల కోసం సిద్ధం చేసిన వాటర్‌ బాటిళ్లు: 10.80 లక్షలు👉మజ్జిగ ప్యాకెట్లు: 16 లక్షలు 👉సభావేదిక చుట్టూ అంబులెన్స్‌లు: ఆరు రూట్లు, 20 అంబులెన్స్‌లు👉మెడికల్‌ క్యాంపు: సభావేదిక చుట్టూ 12 ట్రాఫిక్, పార్కింగ్‌ నిర్వహణ కోసం: 2,500 మంది వలంటీర్లు మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం👉ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్ జాం👉వరంగల్ ఎల్కతుర్తిలో మాజీ సీఎం కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం👉ఎక్కడ కనిపించని ట్రాఫిక్ పోలీసులు.👉రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం👉ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.👉తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్‌ఎస్‌గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్‌ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్‌ఎస్‌ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో 1,200 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు రెండుమూడు రోజుల ముందునుంచే ఎల్కతుర్తికి ప్రయాణం ప్రారంభించాయి.👉14 ఏండ్లు ఉద్యమ పార్టీగా, తొమ్మిదిన్నరేళ్లు అధికార పారీ్టగా ప్రస్థానం సాగించిన బీఆర్‌ఎస్‌.. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్‌ఎస్‌ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.👉సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్‌.. ‘రజతోత్సవ సభ’లో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ చరిత్రలో మొదటి నుంచి కాంగ్రెస్‌ పారీ్టయే విలన్‌గా ఉందని ఈ సభలో కేసీఆర్‌ మరోసారి బలంగా ప్రస్తావించే అవకాశముంది. కేవలం 15 నెలల పాలనలోనే ప్రజల ముందు ఇంతగా పతనమైన ప్రభుత్వాన్ని చూడలేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్‌ చెప్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ మళ్లీ ఛిన్నాభిన్నమైందని ఇటీవల పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. రజతోత్సవ సభలో ఇవే అంశాలను మరింత బలంగా, తనదైన శైలిలో ప్రజలకు వివరించే అవకాశముంది.👉అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమితో అధికారం కోల్పోయిన కేసీఆర్‌.. కొద్ది రోజుల తర్వాత నివాసంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. సుమారు రెండు నెలల చికిత్స, విరామం తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. ఫిబ్రవరి 13న ప్రతిపక్ష నేతగా కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ నల్లగొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మార్చి 12న కరీంనగర్‌లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు.👉2024 మార్చి 31న తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్‌ 5 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేశారు. ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నుంచి రెండు రోజుల పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటులోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో పార్టీ అంతర్గత సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. సుమారు ఏడాది కాలంగా బహిరంగ సభలకు, క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న కేసీఆర్‌.. తిరిగి రజతోత్సవ సభ ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రకటించే భవిష్యత్‌ కార్యాచరణపై అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.👉రజతోత్సవ సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్‌పూర్, బావుపేట తదితర గ్రామాల రైతుల నుంచి సేకరించిన 1,213 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ఇందులో 154 ఎకరాల్లో మహాసభ ఏర్పాట్లు చేయగా, సభకు హాజరయ్యే ప్రజలను తరలించే వాహనాల పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలు కేటాయించారు. వేసవి ప్రతాపం తీవ్రంగా ఉండటంతో సభికుల కోసం 10.80 లక్షల వాటర్‌ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఎండవేడిమికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సేవలందించేందుకు సభావేదిక చుట్టూ 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.👉సభా వేదికను భారీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తోపాటు సుమారు 500 మందివరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్‌ నియంత్రణ కోసం 2,500 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. 1,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్‌ హెలికాప్టర్‌లో వస్తారని పారీ్టవర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సభా వేదికకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు కేసీఆర్‌ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్‌ సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందన్నారు.

What Happened Wife And Husband Suspicious Death In Vishakha3
Visakha: జంట హత్యల కేసులో ఏం జరిగింది..?

విశాఖ: నగరంలోని చోటు చేసుకున్న జంట హత్యల కేసు పోలీసులకు కాస్త తలనొప్పిగా మారింది. దోపీడీ దొంగలు పనై ఉంటుందని తొలుత భావించిన పోలీసులకు ఆ అనావాళ్లు ఏవీ కనిపించడం లేదు. హత్యకు గురైన యోగేంద్ర(66), లక్ష్మీ(58) ఇంట్లో ఎటువంటి చోరీ జరగలేదని గుర్తించారు పోలీసులు. వారికి సంబంధించిన బంగారం ఆభరణాల్లో కొన్నింటిని ఇంట్లోనే గుర్తించారు. అయితే పాత కక్ష్యల కారణంగానే హత్య చేశారని భావిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు గుర్తించారు.ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు..ఈ జంట హత్యల కేసులో దుండగులు ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా.. అత్యంత పకడ్బందీగా నేరానికి పాల్పడటంతో కేసు ఛేదన పోలీసులకు సవాల్‌గా మారింది. ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి కేసు దర్యాప్తును అన్ని కోణాల్లోనూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. హత్యకు గురైన యోగేంద్రబాబు, ఆయన భార్య లక్ష్మి సుమారు 40 ఏళ్లుగా గాజువాకకు సమీపంలోని రాజీవ్‌నగర్‌ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారుయోగేంద్రబాబు నావల్‌ డాక్‌యార్డ్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. స్థానిక గ్లోరియా(ఎయిడెడ్‌) పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్‌ అయిన లక్ష్మి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వారికి ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని స్థానికులు చెబుతున్నారు. వారి ఇద్దరు పిల్లలు శృతి, సుజన్‌ వివాహాలు చేసుకుని అమెరికాలో స్థిరపడటంతో.. ఇంట్లో వీరిద్దరు మాత్రమే ఉంటున్నారు. ఎవరితోనూ గొడవలు లేని వీరిని ఇంత దారుణంగా ఎవరు, ఎందుకు హత్య చేశారన్నది అంతుపట్టని ప్రశ్నగా మారింది.హత్య కోసం అదను చూసుకున్నారా?హత్యకు గురైన దంపతులు గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లు సమాచారం. పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న దాని ప్రకారం గురువారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఈ హత్య జరిగి ఉండవచ్చు. అదే సమయంలో రాజీవ్‌నగర్‌లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుండగులు తమ పని కానిచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలో అదను చూసుకుని కాపు కాసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇంటికి బంధువులు వస్తే కానీ తెలియలేదు..శుక్రవారం రాత్రి వరకు ఈ దారుణం వెలుగులోకి రాలేదు. మృతుల బంధువుల కుమార్తె వారిని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి తాళం వేసి ఉండటం, లోపల ఫోన్‌ మోగుతుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి తలుపులు తెరవగా ఈ ఘోరం వెలుగుచూసింది. ఘటన జరిగిన సమయంలో పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వంటివి దర్యాప్తునకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. వారి పిల్లలు అమెరికా నుంచి వచ్చిన తర్వాతే ఇంట్లో ఏయే వస్తువులు, ఎంత నగదు, బంగారం పోయిందనే వివరాలు కచ్చితంగా తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

What Happens When You Leave Your Bank Account Unused4
అలాంటి బ్యాంక్ అకౌంట్స్ వెంటనే క్లోజ్ చేసుకోండి

సాధారణంగా చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే.. అందులో ఒకటి లేదా రెండు మాత్రమే ఉపయోగిస్తుంటారు. మిగిలినవన్నీ వృధా అన్న మాట. ఇలా వదిలేయడం వల్ల.. కొన్ని నష్టాలు భరించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి నష్టాలేమిటో తెలుసుకుందాం..బ్యాంక్ చార్జీలుఒక బ్యాంకులో అకౌంట్ ఉందంటే.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. ఒకవేళా మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే.. వాటిపై బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది. కొన్ని సార్లు మైనస్ బ్యాలెన్స్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తరువాత లావాదేవీలు చేయాలంటే.. ముందు మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేయాల్సిందే.డబ్బు వృధాబ్యాంక్ అకౌంట్ ఉపయోగించకుండా.. అలాగే వదిలేస్తే అందులో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ వంటివి వృధా అవుతాయి. మీకు ఓ ఐదు అకౌంట్స్ ఉన్నాయనుకుంటే.. అందులో మీరు కేవలం ఒకదాన్ని మాత్రం వాడుతూ.. మిగిలినవి ఉపయోగించకుండా వదిలేస్తే అందులో ఉన్న డబ్బు వృధా అయినట్టే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కువ అకౌంట్స్ మెయింటెన్సన్ చేయకుండా ఉండటమే ఉత్తమం.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం.. ఒకేరోజు 52 కార్ల డెలివరీమోసాలకు అవకాశంటెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు ఎక్కువవుతున్నాయి. మీరు ఉపయోగించకుండా ఉంటే.. అలాంటి అకౌంట్లను కొందరు సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇవి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ వృధాగా ఉన్నా.. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదా క్లోజ్ చేసుకోవడం మంచిది.సిబిల్ స్కోరుపై ప్రభావంబ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా లేకుంటే.. మైనస్ బ్యాలెన్స్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే దీనర్థం మీరు బ్యాంకుకు అప్పు ఉన్నారన్నమాట. ఇది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. దీంతో సిబల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. యాక్టివ్‌గా ఉన్న అకౌంట్స్ కాకుండా.. మిగిలినవన్నీ వెంటనే క్లోజ్ చేసుకోవాలి.

IPL 2025: Suresh Raina Believe That Dhoni Is Set To Play For At Least One More Season5
IPL 2025: ధోని ఇంకో సీజన్‌ ​కూడా ఆడతాడు..!

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఫైవ్‌ టైమ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం​ రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే అధికారికంగా ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్నప్పటికీ.. అది ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. ఆ జట్టు తదుపరి ఆడబోయే ఐదు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాలి. అయినా సీఎస్‌కే భవితవ్యం ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటుంది.ఈ సీజన్‌లో సీఎస్‌కే దుస్థితికి జట్టు ఎంపికే ప్రధాన కారణమన్నది బహిరంగ రహస్యం. మెగా వేలంలో సీఎస్‌కే యాజమాన్యం రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా, విజయ్‌ శ​ంకర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ లాంటి ఔట్‌ డేటెడ్‌ ఆటగాళ్లను ఎంపిక చేసుకుని మూల్యం చెల్లించుకుంది. జట్టులో ఒక్క విధ్వంసకర బ్యాటర్‌ ఉండేలా కూడా జాగ్రత్త పడలేదు. బౌలింగ్‌ విభాగంలో పర్వాలేదనినపిస్తున్నా ప్రతి మ్యాచ్‌లో వారిని నుంచే ఆశించడం​ అత్యాశ అవుతుంది.ఈ సీజన్‌లో సీఎస్‌కే పేలవ ప్రదర్శనల నేపథ్యంలో ఆ జట్టు తాతాల్కిక సారధి ఎం​ఎస్‌ ధోని భవితవ్యంపై కూడా మరోసారి చర్చ మొదలైంది. ధోని కాస్తో కూస్తో ఫామ్‌లో ఉన్నప్పుడే హుందాగా తప్పుకుని ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వయసు మీద పడటంతో ధోని తన పాత్రకు అస్సలు న్యాయం చేయలేకపోతున్నాడని విశ్లేషకులు వాదిస్తున్నారు.ఐపీఎల్‌లో సీఎస్‌కే మరియు ధోని భవితవ్యంపై చిన్న తలా సురేశ్‌ రైనా స్పందించాడు. జతిన్ సప్రుతో చాట్‌లో మాట్లాడుతూ.. ధోని కనీసం ఇంకో సీజన్‌ ఆడతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. సీఎస్‌కే వచ్చే సీజన్‌లో మెరుగైన ప్రణాళికతో ముందుకు వస్తుందని ఆశాభావం​ వ్యక్తం చేశాడు. ధోని తన బ్రాండ్‌ మరియు అభిమానుల కోసమే క్రికెట్‌ ఆడుతున్నాడని అన్నాడు. 43 ఏళ్ల వయసులోనూ బ్యాటింగ్‌, వికెట్ కీపింగ్‌తో పాటు కెప్టెన్సీ బాధ్యతలు కూడా మోస్తూ సీఎస్‌కే కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నాడని తెలిపాడు. ధోని ఒక్కడే అన్ని బాధ్యతలను మోస్తుంటే మిగతా పది మంది ఆటగాళ్ళు ఏం​ చేస్తున్నారని ప్రశ్నించాడు.జట్టు ఎంపికలో ధోనిదే తది నిర్ణయం అన్న ప్రచారాన్ని కొట్టి పారేశాడు. పలానా ఆటగాడితో కొనసాగాలా వద్దా అన్న దానిపై మాత్రం ధోనికి కాల్ రావచ్చని తెలిపాడు. తనకు తెలిసి జట్టు ఎంపిక ప్రక్రియలో ధోని ఎప్పుడూ పాల్గొనలేదని స్పష్టం చేశాడు. ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని సీఎస్‌కే కోర్ గ్రూప్ పర్యవేక్షిస్తుందని తెలిపాడు. ఒకవేళ కోర్‌ గ్రూప్‌ ధోనిని తన అభిప్రాయాన్ని వెల్లడించమని అడిగినా అతను నలుగురైదుగురు ఆటగాళ్ల పేర్లను సూచించి ఉండవచ్చని తెలిపాడు.

India Effect Pakistan takes Emergency steps for pharma supplies6
భారత్‌తో పెట్టుకుంటే అంతే సంగతి.. పాకిస్తాన్‌లో ఔషధ ఎమర్జెన్సీ!

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు దేశాల ప్రజలు తమ స్వదేశాలకు చేరుకుంటున్నారు. ఇక, ఉగ్రదాడి కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం సైతం దెబ్బతింది. ఈ క్రమంలోనే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపేయడంతో రెచ్చిపోయిన పాక్‌ ఆవేశంతో భారత్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకుంది. దీంతో, అసలుకే ఎసరు వచ్చే పరిస్థితిని తెచ్చుకుంది.భారత్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకున్న పాకిస్తాన్‌కు ఔషధాల పరంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఔషధ ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. తాజాగా ఔషధాల నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని సంబంధిత విభాగాలకు పాక్‌ వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ప్రస్తుతం భారత్‌ నుంచి పాకిస్థాన్‌.. 30-40 శాతం ఔషధ ముడి సరకు, ఔషధంలో వాడే ప్రధాన పదార్థం, చికిత్స ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ అప్రమత్తమైంది. ఔషధ రంగంపై నిషేధం ప్రభావం గురించి అధికారిక నోటిఫికేషన్ లేనప్పటికీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధమయ్యాయని పాకిస్థాన్‌ ఔషధ నియంత్రణ సంస్థ (డీఆర్‌ఏపీ) శనివారం వెల్లడించింది.అనంతరం, డీఆర్‌ఏపీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. చైనా, రష్యా, ఐరోపా దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు . రేబిస్‌ టీకా, పాము కాటు మందు, క్యాన్సర్‌ చికిత్సలకు అవసరమైన ఔషధాలను, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ తదితరాలను అత్యవసరంగా నిల్వ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామని వివరించారు. తగు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. అయితే, ఔషధాల ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్తాన్‌లో బ్లాక్‌ మార్కెట్‌ దందా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. దీనిపై తగు చర్యలు తీసుకునేందు కూడా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. భారత ఫార్మానే పాక్‌కు కీలకం..ప్రస్తుతం, పాకిస్తాన్ తన ఔషధ ముడి పదార్థాలలో భారత్‌పై ఆధారపడుతోంది. వీటిలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (API), వివిధ అధునాతన చికిత్సా ఉత్పత్తులు ఉన్నాయి. ముఖ్యంగా, క్యాన్సర్ నిరోధక చికిత్సలు, జీవ ఉత్పత్తులు, వ్యాక్సిన్‌లు, సెరా, యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ మరియు యాంటీ-స్నేక్ వెనమ్‌ను భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇక, చాలా వరకు భారత్‌ చెందిన మందులు.. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, తూర్పు సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌లోకి అక్రమంగా రవాణా చేయబడుతున్నాయి. బ్లాక్ మార్కెట్ నుంచి మందులు తరలిస్తున్నారు.🚨 Crisis Brews in Pakistan's HealthcareAfter suspending trade with India over the Pahalgam attack fallout, Pakistan faces a looming pharmaceutical shortage.Authorities scramble to secure vital drug supplies from China, Russia, and Europe, as 30%-40% of raw materials were… pic.twitter.com/Gz9HCEiLXt— Instant News 247 (@instant_news247) April 26, 2025భారత్‌తో పెట్టుకుంటే పాతళానికి పాక్‌..ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌ స్వీయ తప్పిదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ.. దివాళా అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమా అని కొద్దిగా కోలుకుంటోంది. కానీ, ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి స్థితిలో భారత్‌తో స్వల్పకాల యుద్ధం చేసినా పాక్‌ ఆర్థిక వ్యవస్థ నిండా మునగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 50 ఏళ్ల కిందట పాకిస్థాన్‌.. దక్షిణాసియాలో ధనిక దేశం. స్వాతంత్య్రం వచ్చాక ఆ దేశం మంచి ఆర్థిక వృద్ధిని కనబరచింది. ముఖ్యంగా 1960, 1970లలో ధనిక దేశంగా వెలుగొందింది. బలమైన ఆర్థిక నిర్వహణ, భారీగా విదేశీ సాయం, వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిపై దృష్టి వంటి అంశాలు బాగా కలిసొచ్చాయి.అనంతర కాలంలో.. దుష్పరిపాలన, సైనిక నియంతలు, సీమాంతర ఉగ్రవాదాన్ని ‍ప్రోత్సహించడం వంటి చేయడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అందుకే.. నేడు దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో పాక్‌ ఒకటిగా మారింది. కోవిడ్‌ మహమ్మారితో కుదేలైన పాక్‌ ఆ తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. పాక్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే.. టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి అప్పు చేయాల్సి వస్తోందని.. అందువల్ల టీ వినియోగాన్ని తగ్గించాలని స్వయానా పాక్‌ ప్రణాళిక శాఖ మంత్రి అహ్‌సాన్‌ ఇక్బాల్‌ కోరారు. దీంతో, ఎంతటి దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేయడం వల్ల పాక్‌ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో సైనిక ఘర్షణ, యుద్ధం వంటి పరిస్థితులు వస్తే.. అది పాకిస్తాన్‌ను మరింత దెబ్బతీస్తుంది.

Pak Minister Hanif Abbasi Open Threat To India7
భారత్‌పై దాడి కోసం 130 అణు బాంబులు.. పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్‌ 130కి పైగా అణు ఆయుధాలతో పాటు ఘోరి, షాహీన్, ఘజ్నవి మిసైళ్ళను సిద్ధం చేసినట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలిచిన పహల్గాం ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్‌ తన చర్యల ద్వారా దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సింధూ నదీ జలాల నిలిపివేత, పాకిస్తాన్ జాతీయుల వీసాలు రద్దు, ఇతర వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక దీనంగా చూస్తోంది.ఈ క్రమంలో హనీఫ్‌ అబ్బాసీ భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేశారు. భారత్‌ ఇండస్ వాటర్‌ ఒప్పందాన్ని నిలిపివేస్తే యుద్ధానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. యుద్ధం చేసేందుకు తాము సన్నంద్ధంగా ఉన్నామని, దేశ వ్యాప్తంగా అణు ఆయుధాల్ని సిద్ధం చేశామన్నారు. ఆ అణు ఆయుధాలు ప్రదర్శన కోసం కాదని, భారత్‌పై దాడి చేసేందుకేనని చెప్పారు. "Pakistan's nuclear missiles are not for decoration. They have been made for India," threatens Railway Minister Muhammad Hanif Abbasi pic.twitter.com/UqCCRmpXx6— Shashank Mattoo (@MattooShashank) April 27, 2025 స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నీటి సరఫరాను ఆపితే మనతో యుద్ధం చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉండాలి. మన వద్ద ఉన్న సైనిక పరికరాలు, మిసైళ్ళు ప్రదర్శన కోసం కాదు. మన అణు ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. నేను మళ్లీ చెబుతున్నాను, ఈ బాలిస్టిక్ మిసైళ్ళు, అవన్నీ భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించిందని ఒప్పుకున్నారు. దాని ఫలితమే ఈ దుర్భర పరిస్థితులకు కారణమని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

Director Geetha Krishna Sensational Comments on MM Keeravani8
కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి: దర్శకుడు

పాడుతా తీయగా షోలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది సింగర్‌ ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aaradhya). షో నిర్మాతల దగ్గరి నుంచి జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్‌ వరకూ అందరూ తనను చీడపురుగులా చూశారని, అవమానించారని గోడు వెల్లబోసుకుంది. దీనిపై సింగర్‌ లిప్సిక స్పందిస్తూ.. ఆ జడ్జిలు పెద్దవాళ్లని.. వాళ్లు కూడా ఒకప్పుడు ఎంతో కష్టపడ్డారంది. కీరవాణి దగ్గర చాకిరీ..కీరవాణి (MM Keeravani) దగ్గర మెప్పు పొందేందుకు తను కూడా ఐదారేళ్లు కష్టపడిందని.. తర్వాతే ఆయన దగ్గర పాడే అవకాశం దక్కిందని తెలిపింది. కీరవాణి దగ్గర చాకిరీ చేయడం సింగర్స్‌ అందరికీ ఇష్టమేనని.. చాకిరీ అంటే నోట్స్‌ రాయడం, ప్రాక్టీస్‌ చేయడంలాంటివి ఉంటాయంది. లిప్సిక మాత్రమే కాదు పలువురు సింగర్లు సైతం.. ప్రవస్తిని తప్పుపడుతూ జడ్జిలకు సపోర్ట్‌ చేస్తూ వీడియోలు రిలీజ్‌ చేశారు. తాజాగా ఓ తెలుగు దర్శకుడు మాత్రం ప్రవస్తికి సపోర్ట్‌ చేస్తూ మాట్లాడాడు.ఇన్నాళ్లు పోనీలే అని మౌనంగా..సీనియర్‌ డైరెక్టర్‌ గీతా కృష్ణ.. తప్పంతా కీరవాణిదే అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గీతా కృష్ణ (Geetha Krishna) మాట్లాడుతూ.. కీరవాణి ఒక వ్యభిచారి.. వాడి గురించి నాకు 40 సంవత్సరాల నుంచి తెలుసు.. వాడి గురించి మనకెందుకులే అని వదిలేశాను. చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్లు. తనపై దుమ్మెత్తిపోయాల్సిన అవసరం నాకేంటని మౌనంగా ఉన్నాను. ఎప్పుడైనా రెండు, మూడు పార్టీల్లో కలిశాడు. అంతే!పోక్సో కేసు పెట్టాలిరాజమౌళి గురించి అటువంటి రిమార్క్‌ అయితే వినలేదు. కీరవాణి తండ్రి కూడా నాతో చాలా బాగా మాట్లాడతాడు. ఇప్పుడు కీరవాణి గురించి ఎందుకిలా అంటున్నానంటే.. వీడికి అమ్మాయిలను సప్లై చేసేవారితో స్కూల్‌ పిల్లలు కావాలని అడుగుతాడట! కీరవాణిపై పోక్సో కేస్‌ వేయాలి. కీరవాణికి క్లాసికల్‌ వచ్చు కానీ వెస్ట్రన్‌ కీబోర్డ్‌ ప్లే చేయడం రాదు. ఈ విషయంలో మణిశర్మ కీరవాణికి సాయం చేశేవాడు.వెధవ కబుర్లు..అప్పట్లో కీరవాణిని ఆఫీస్‌లో నుంచి గెంటేశారని తెలిసి నా సినిమాకు పిలిపించుకుని వెయ్యి రూపాయలు ఇచ్చాను. ఇప్పుడేమో పెళ్లిళ్లలో పాటలు పాడేవారంటే చిరాకు.. మా ఇంటికొచ్చి వెట్టిచాకిరీ చేయాలి అని వెధవ కబుర్లు చెప్తున్నావ్‌.. నువ్వేం మహారాజువి కాదు అని గీతా కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గీతా కృష్ణ.. సంకీర్తన, కోకిల, కీచురాళ్లు, సర్వర్‌ సుందరంగారి అబ్బాయి, కాఫీ బార్‌ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళంలో టైమ్‌, నిమిడంగల్‌ చిత్రాలు చేశాడు. సంకీర్తన చిత్రానికిగానూ నంది అవార్డు అందుకున్నాడు.చదవండి: ట్రైలర్‌: సీరియల్స్‌ చూస్తున్నంతసేపు దెయ్యంగా.. కాపాడనున్న

PM Modi Big Message Over Pahalgam Incident In Mann Ki Baat9
భారతీయుడి రక్తం మరిగిపోతుంది.. వారికి ఊహించని శిక్ష ఖాయం: మోదీ

సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పహల్గాం దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన.. వారు ఊహించని శిక్ష పడుతుందని హెచ్చరించారు. అలాగే, కశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే ఉగ్రవాద సూత్రదారులు దాడులు చేశారని మోదీ ఆరోపించారు.ప్రధాని మోదీ ఈరోజు మన్‌ కీ బాత్‌లో మాట్లాడుతూ..‘కశ్మీర్‌ను నాశనం చేసేందుకే ఉగ్రవాదుల దాడి జరిగింది. కశ్మీర్‌లో అభివృద్ధి వేగం పెరిగింది, టూరిస్టులు సంఖ్య పెరిగి ఆదాయం వృద్ధి చెందింది. దీన్ని ఓర్వలేక దాడులు చేస్తున్నారు. ఈ దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ప్రపంచం భారతదేశం పక్షాన నిలుస్తోంది. ప్రపంచం మొత్తం 140 కోట్ల భారతీయులతో కలిసి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరాటానికి మద్దతుగా ఉంది.Our Hon PM Thiru @narendramodi avl, in the 121st episode of Mann Ki Baat, reaffirmed that the victims of the Pahalgam terrorist attack will definitely get justice and the perpetrators & conspirators of this terrorist attack will face the harshest response! pic.twitter.com/ISq01DYpS5— K.Annamalai (@annamalai_k) April 27, 2025బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన, వారు ఊహించని శిక్ష పడుతుంది. భారత్‌లోని ప్రజల ఆగ్రహం ప్రపంచం మొత్తంలో ప్రతిఫలిస్తోంది. ప్రపంచ నాయకులు ఫోన్ చేసి, లేఖలు రాసి, సందేశాలు పంపి తమ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని గట్టిగా ఖండించారు. మనం సంకల్పాన్ని బలపర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మన సంకల్పాన్ని బలోపేతం చేయాలి.దేశం ఇప్పుడు ఏకతాటిపై మాట్లాడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఏకతా శక్తి అవసరం. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న శక్తులు కశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలనుకుంటున్నాయి. దేశం ఐకమత్యమే మన విజయానికి ఆధారం. పహల్గాంలో జరిగిన దాడి ఉగ్రవాదుల మూర్ఖత్వాన్ని, నిస్సహాయతను చూపిస్తుంది. 22 ఏప్రిల్ పహల్గాం ఉగ్రదాడి ప్రతీ భారతీయుడి మనసును కలచివేసింది. ప్రతీ రాష్ట్రం, ప్రతీ భాషకు చెందిన వారు బాధిత కుటుంబాల కష్టాన్ని తలచుకుంటున్నారు. ప్రతీ భారతీయుడి గుండె ఉగ్ర దాడి దృశ్యాలను చూసి రగులుతోంది అంటూ చెప్పుకొచ్చారు.

India Warships Carry Out Missile Firings In Arabian Sea10
సరిహద్దుల్లో టెన్షన్‌.. విధ్వంసక క్షిపణి పరీక్ష చేపట్టిన భారత్‌

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత సరిహద్దుల్లో పాక్‌ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది.వివరాల ప్రకారం.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా.. ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్‌ నేవీ సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు క్షిపణి పరీక్షలకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అయితే, మూడు రోజుల క్రితమే భారత్‌ ఇదే సముద్రంలో మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (ఎంఆర్‌-ఎస్‌ఏఎం)తో సీ స్కిమ్మింగ్‌ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌లుగా పేర్కొంటారు.#IndianNavy Ships undertook successful multiple anti-ship firings to revalidate and demonstrate readiness of platforms, systems and crew for long range precision offensive strike.#IndianNavy stands #CombatReady #Credible and #FutureReady in safeguarding the nation’s maritime… pic.twitter.com/NWwSITBzKK— SpokespersonNavy (@indiannavy) April 27, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement