శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకుంటాం
ధర్మపురి: దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ట్రప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని దమ్మన్నపేటకు చెందిన శ్రీనివాస్ బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లి కంపెనీలో పని చేసుకుంటున్నాడు. ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు శ్రీనివాస్‌ను కత్తితో నరికి చంపిన విషయం తెలిసిందే. విప్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి బుధవారం మృతుడి తల్లి రాజవ్వ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్రీనివాస్ హత్యకు గురికావడం బాధాకరమన్నారు. శ్రీనివాస్ కొడుకుకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగంతోపాటు ఇందిరమ్మ ఇల్లు, ఎన్నారై పాలసీ కింద రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేలా కృషి చేస్తామని అన్నారు. నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, చీపిరిశెట్టి రాజేశ్ ఉన్నారు.
శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న
విప్ అడ్లూరి, జీవన్‌రెడ్డి


