త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే
జగిత్యాలటౌన్/కథలాపూర్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు
ఘనంగా జరిగాయి. యేసుక్రీస్తును శిలువ వేసిన రోజును పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రఖ్యాత సీఎస్ చర్చితో పాటు ధరూర్ క్యాంపు యేబ్రోను, గోవింద్‌పల్లిలోని యేసురక్తం చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మిషన్ కాంపౌండ్‌లోని సీఎస్‌ఐ వెస్లీ చర్చిలో ఫాస్ట్రెస్ చైర్మన్ రెవా జీవరత్నం గుడ్ ఫ్రైడే సందేశం అందించారు. ఉమెన్స్ ఫెలోషిప్ సభ్యులు ప్రత్యేక గీతాలు ఆలపించారు.
త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే


